Breaking News

Samantha: డయాబెటిస్‌ పేషెంట్లు ఇలా చేశారంటే..!

Published on Tue, 06/24/2025 - 16:08

నటి సమంత రూత్‌ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న నటి. ఆమె అరుదైన మయోసైటిస్‌  అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆరోగ్యంపై పూర్తి ఫోకస్‌ పెట్టి..ఫిట్‌నెస్‌కి సంబంధించిన చిట్కాలను అభిమానులతో ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటుంటుంది. వర్కౌట్ల దగ్గర నుంచి మానసిక ఆరోగ్యం వరకు ప్రతిదానిపై తన అభిమానులకు ఆరోగ్య స్ప్రుహను కలిగిస్తోంది. అలానే ఈసారి డయాబెటిస్‌ పేషెంట్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చిట్కాలను షేర్‌ చేసుకుంది. తన అనుభవ పూర్వకంగా తెలుసుకున్న టిప్‌ గురించి చాలా చక్కగా వివరించింది. అదేంటో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.

డయాబెటిస్‌ పేషెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగ ఉంచుకోవడం అనేది అతిముఖ్యమైనది. ఆరోగ్యకరమైన భోజనంతోనే దాన్ని నివారించొచ్చట. సముతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆ సమస్య ఉండదని అంటున్నారు. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో చక్కెర పెరుగుతుందని తాను కూడా గుర్తించానని అంటోంది సమంత. భోజనం ఆరోగ్యకరమైనదే అయినా ఈ సమస్య ఉత్ఫన్నం కావడం ఆశ్చర్యకరంగా అనిపించినా..ఒక అద్భుతమైన చిట్కాతో ఆ సమస్యను నివారించానని అన్నారామె. 

మనం తీసుకునే ఆహారా క్రమాన్ని మార్చితే చాలు..రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గడం గమినించొచ్చని చెబుతోంది. తాను దీన్ని నిరంతర గ్లూకోజ్ మానిటర్‌తో గురించానని వివరించింది. అందువల్లే తాను ముందుగా కూరగాయలు, తర్వాత ప్రోటీన్‌, చివరిలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వంటివి ప్రారంభించినట్లు వివరించింది. ఈ విధానం తనకు చాలా అద్భుతంగా ఉపయోగపడిందని అంటోంది. దీన్ని ఫుడ్‌ సక్వెన్సింగ్‌ అంటారు. డయాబెటిస్‌ ఉన్నవారికి బాగా హెల్ప్‌ అయ్యే చిట్కాగా చాలా ప్రజాదరణ పొందుతోంది.

ఫుడ్ సీక్వెన్సింగ్ అంటే..
ఇక్కడ వివిధ రకాల ఆహారాలను ఒక నిర్ధిష్ట క్రమంలో తినాలి. ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలతో భోజనాన్ని ప్రారంభించాలి. తర్వాత ప్రోటీన్‌ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. చివరగా బియ్యం లేదా బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్‌లతో ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పీచు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలతో జీర్ణక్రియం నెమ్మదించడంతో శరీరం చక్కెరను గ్రహించడం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.

ఈ విధానం ఎందుకు మంచిదంటే..

  • తిన్న తర్వాత, మన రక్తంలో చక్కెర సహజంగా పెరుగుతుంది. అయితే అది చాలా స్పీడ్‌గా పెరిగితే టైప్ 2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

  • అదే మొదటగా కూరగాయలు, ప్రోటీన్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయిని పరిశోధనలో వెల్లడైంది. 
    ప్రయోజనాలు..

  • కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

  • కార్బోహైడ్రేట్లు తీసుకునే ముందు ప్రోటీన్ తినడం వల్ల హార్మోన్ GLP-1 పెరుగుతుంది. తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. 

  • దీనివల్ల ఆటోమేటిగ్గా చిరుతిండిన తగ్గించగలుగుతాం. పైగా బరువు నిర్వహణకు మద్దతిస్తుంది. మధుమేహం ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 

  • పైగా ఇది మెరుగైన జీర్ణక్రియ, శక్తిని అందిస్తుంది

ఎలా తినాలంటే..

  • పాలకూర, క్యారెట్లు లేదా ఓక్రా వంటి కూరగాయలతో భోజనం ప్రారంభించండి.

  • గుడ్లు, పప్పు, చికెన్, టోఫు లేదా పనీర్ వంటి ప్రోటీన్‌తో అనుసరించండి.

  • ముగించడం..కార్బోహైడ్రేట్లు - బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్ వంటి తృణధాన్యాలు ప్రాధాన్యంగా తీసుకోవాలి.

  • భోజనంతో పాటు చక్కెర పానీయాలను నివారించాలి.

  • శరీరంలో వాపులను తగ్గించడానికి ఎర్ర మాంసం కంటే లీన్ ప్రోటీన్లు లేదా మొక్కల ఆధారిత ఎంపికలను ఎంచుకోవాలి.

గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: జస్ట్‌ ఆరు రోజుల్లో ఇంగ్లీష్‌, అలవోకగా 46 భాషలు..ఏకంగా 400..)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)