Breaking News

దెయ్యం కావాలంటూ ప్రకటన!

Published on Sat, 05/02/2026 - 14:41

కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు దెయ్యంతో చిన్న ఇంటర్వ్యూ కావలెను. 
సదరు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగువాడు మా బుజ్జిగాడు. 
వాడి అడ్రస్‌... బుజ్జిగాడు, ప్రేమ్‌నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, హైదరాబాద్‌. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు ఫలానా... ఫలానా. 
మా బుజ్జిగాడు పగలు నిద్రపోయి రాత్రంతా అల్లరిచేస్తూ ఉంటాడు కాబట్టి సంప్రదింపులకు దెయ్యాలకూ వీలుగా ఉంటుంది. ఆసక్తిగల దెయ్యాలు సదరు ఫోన్‌  నంబరులో నేరుగా సంప్రదించవచ్చు. ఇట్లు రాంబాబు.

ఈ ప్రకటన చూడగానే మా రాంబాబుగాడికి ఫోన్‌ చేయక తప్పలేదు. 
‘‘ఎందుకురా ఆ ప్రకటన ఇచ్చావ్‌?’’ అంటూ నేనడగ్గానే వాడు భోరుమన్నాడు. తమ బుజ్జిగాడికొచ్చిన డౌట్లు గురించి బిక్కుబిక్కుమంటూ వాడు చెప్పిన వివరాలివి...  

‘‘నాన్నా... దెయ్యాలు ఒరిజినల్‌గా తాము పుట్టినరోజునే బర్త్‌–డే చేసుకుంటాయా? లేదంటే... తాము చచ్చిన రోజునే అవి దెయ్యాలై పుడతాయి  కాబట్టి తమ డెత్‌–డే రోజున బర్త్‌డే చేసుకుంటాయా?’’ అడిగాడు. 

రాంబాబుగాడికి ఏం చెప్పాలో తోచలేదట. బుజ్జిగాడొచ్చి ఈ డౌటడిగాక వాడి సందేహంలోనూ న్యాయముందని అనిపించిందట. అంతేకాదు... తన పుట్టినరోజునే తానూ చచ్చిపోవాలనీ... దాంతో దెయ్యంగా మారాక బర్త్‌–డే విషయంలో తనకూ  పెద్దగా కన్ఫ్యూజన్‌ ఉండదనీ... పైగా పుట్టినరోజూ, చచ్చినరోజూ ఒకటే అయితే డేటు మర్చిపోకుండా ఉండేందుకు మాం...ఛి అడ్వాంటేజు కూడా ఉంటుందని అనిపించిందట.

మరోరోజు బుజ్జిగాడు మరోమారు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘నాన్నా... ఆరోజున నువ్వు మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ దెయ్యాల్లో... జుట్టుదెయ్యాలూ, గుండు దెయ్యాలూ, కొరివిదెయ్యాలూ, రాఛ్ఛాసులూ, బ్రమ్మరాచ్చసులూ, పిశాచులూ, బేతాళ పిచాచులూ అంటూ రకరకాల కులాలుంటాయని మన బే...ద్ధ రచయిత పతంజలి గారు చెప్పారంటూ ఎవరికో స్పీచు ఇచ్చావ్‌ కదా. అప్పుడూ... దెయ్యాల్లో గనకా ఎలచ్చన్లు గట్రా అవుతుంటే ఎక్కడ ఏ క్యాస్టు దెయ్యాలు ఎక్కువో... అక్కడ వాళ్లనే క్యాండిడేటుగా నిలబెడతారు కదా’’ అని అడిగాడు బుజ్జిగాడు.

రాంబాబుగాడిక్కూడా అది కరెక్టుగా అనిపించిందట. ఉదాహరణకు ‘చింతనిప్పుల అనే ఓ చింతలతోపు నియోజకవర్గంలో కొరివిదెయ్యాల కులపోళ్లు ఎక్కువగా ఉన్నారనుకుందాం. అక్కడ పిశాచాల కులపు క్యాండిడేటును నిలబెడితే వాడికి ఓట్లు పడతాయా? అలాగే ‘మర్రిఊడల’ అనే మరో నియోజకవర్గంలో బేతాళ పిశాచాలు ఎక్కువగా ఉంటే అక్కడ మన జుట్టుదెయ్యాలకు ఓటెవడేస్తాడు!! బుజ్జిగాడు చెప్పాక ఈ డౌటు తననూ వేధించిందం’టూ వాడు మధనపడ్డాడు.

ఇంకోరోజు మా పోర్షన్‌ కు ముందు ఓ షట్టర్‌లో రెంటుకుండే ఓ టైలర్‌గారి దగ్గర వెళ్లి... ‘‘అంకుల్‌... దెయ్యాలు తమ తెల్లచీరలకు పీకోఫాల్సూ, వాళ్లకు మ్యాచింగు బ్లౌజులూ మీరే కుడతారా?’’ అంటూ తనను తరచూ ముద్దుచేస్తుండే ఆ టైలర్‌గారిని అడిగాట్ట. ఆయన దగ్గర ఉండే చనువు కొద్దీ ఈ ప్రశ్నైతే వేశాడుగానీ అతడికీ ఏం చెప్పాలో తెలియలేదు. ‘‘ఏమో... దెయ్యాల జుట్టుకు షాంపూలూ, దువ్వెన్లూ ఎక్కణ్ణుంచి కొంటారో’’ అంటూ బుజ్జిగాడు అడిగిన మరో ప్రశ్నకు... సదరు టైలరూ, మా వీధిలోని కిరాణా కొట్టు ఓనర్లతో పాటు నేనూ డౌట్లలో మునిగిపోయాం.

‘‘దెయ్యాల గురించి మావాడు తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులివ్వలేకా... వాడు రోజు విడిచి రోజు... ఈ ప్రశ్నల్తో వేధిస్తుంటే తట్టుకోలేకా ఈ ప్రకటన ఇచ్చాన్రా! ఈ యాడ్‌ చూసుకొని ఎవడైనా పిల్లపిశాచిగాడో, ఏ దెయ్యప్పిల్లో రెస్పాండ్‌ అయితే... వాడికీ మా బుజ్జిగాడికీ ఫ్రెండ్‌షిప్పు కుదిర్చేసి నేను హాయిగా, హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండొచ్చని ఇచ్చాన్రా ఈ ప్రకటన’’ అంటూ భోరుమన్నాడు మా రాంబాబుగాడు. 

చ‌ద‌వండి: సారీ... విసిగి వేసారి..

ఈలోపు నేనూరుకోలేదు. మా రాంబాబుగాణ్ణి మరింత కన్ఫ్యూజన్‌లో పడేస్తూ... ‘‘అన్నట్టూ... దెయ్యాలు న్యూస్‌ పేపర్లు చదువుతాయంటావా?’’ అని అడిగా. 

– యాసీన్‌ 

#

Tags : 1

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)