Breaking News

సై‘లెన్స్‌’ సాహసం

Published on Tue, 08/19/2025 - 01:11

మనిషి మూడో కన్ను కెమెరా. రెండు కళ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ఛాయాచిత్ర ప్రపంచంలో మహిళా ఫొటోగ్రాఫర్‌లు తమదైన ముద్ర వేసారు. 
ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలు, అణగారిన వర్గాల పోరాటాలు, భిన్నమైన సాంస్కృతిక అంశాలను ఫొటోగ్రఫీలోకి తీసుకువస్తున్నారు.

ఆ కెమెరా... అణగారిన వర్గాల గొంతుక
-భూమిక సరస్వతి
ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలను, అణగారిన వర్గాల ఉద్యమాలను, దళిత, ఆదివాసీ జీవితాలను తన కెమెరా కంటితో చిత్రిస్తోంది భూమిక సరస్వతి. పర్యావరణ సంరక్షణపై దళిత, ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని ‘అన్‌ ఈక్వల్‌ హీట్‌’ టైటిల్‌తో ఫొటో డాక్యుమెంటేషన్‌ చేసింది. భూమిక తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫొటోలను ఎక్కువగా చత్తీస్‌ఘడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో తీసింది. ‘అన్‌ ఈక్వల్‌ హీట్‌’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అదే పనిగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యానికి గురైన రోజులు ఉన్నాయి. అక్రమ మైనింగ్‌ జరిగే ప్రాంతాల్లో కెమెరాతో వెళ్లడం అంటే ప్రమాదమే. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది.

అదర్‌ సైడ్‌
కేరళలోని కోజికోడ్‌కు చెందిన కీర్తన కున్నాత్‌ లండన్‌లో స్థిరపడింది. జెండర్‌ నుంచి మెంటల్‌ హెల్త్‌ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్‌ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్‌... నాట్‌ వాట్‌ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్‌లపై చేసిన ఫొటోసిరీస్‌ ఇది. ఈ సిరీస్‌కు ‘అండర్‌ 30’ విభాగంలో ది రాయల్‌ ఫోటోగ్రాఫిక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ అవార్డ్‌ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్‌ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్‌ వాట్‌ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్‌ కోసం అనలాగ్‌ మీడియం ఫార్మట్‌ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్‌ చేసింది.
-కీర్తన కున్నాత్‌

డాటర్‌ ఆఫ్‌ రఘు రాయ్‌
చిన్నప్పుడు గిఫ్ట్‌గా కెమెరా అందుకున్న అవనీ రాయ్‌ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌ రఘు రాయ్‌ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్‌ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్‌ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్‌లను ‘ఉమెన్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ ఫొటోసీరిస్‌లో హైలెట్‌ చేయడానికి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది.
అవనీ రాయ్‌
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)