Breaking News

ఆమె అడుగుజాడలు

Published on Thu, 02/19/2026 - 05:54

మన దేశంలోని మొట్ట మొదటి మహిళా ఆంత్రపాలజిస్ట్‌ ఐరావతి కార్వే. జర్మనీలో శిక్షణ పొందిన కార్వే పుణేలోని దక్కన్‌ కళాశాలలో మావనశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. 

భారతీయ సంస్కృతి, నాగరికత, కులవ్యవస్థపై ఆమె విలువైన రచనలు చేశారు. ఆంత్రపాలజీ అంటే గుర్తుకు వచ్చే మహిళ అయినప్పటికీ కార్వే జీవితం గురించి చాలా విషయాలు తెలియవు. ఈ లోటును పూరించేలా ఆమె మనవరాలు ఉర్మిలా దేశ్‌పాండే, విద్యావేత్త థియాగో బార్బోసాతో కలిసి ‘ది రీమార్కబుల్‌ లైఫ్‌ ఆఫ్‌ ఐరావతి కార్వే’ అనే పుస్తకం రాశారు.

ఆమెదే రిస్క్‌
అండమాన్, నికోబార్‌ దీవులలోని ఆదిమజాతి ప్రజలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయ. అండమాన్‌ దీవులలో ఫీల్డ్‌వర్క్‌ చేయడానికి మధుమాలను అనుమతించే ముందు ఆంత్రపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించదని నిర్ధారిస్తున్న పత్రాలపై సంతకం చేయాలని కోరింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. అండమాన్, నికోబార్‌ దీవులలోని వివిధ తెగలపై ఆరు సంవత్సరాలు పరిశోధన చేశారు.

ఫెమినిస్ట్‌ ఆంత్రపాలజీ
20వ శతాబ్దంలో ‘ఫెమినిస్ట్‌  ఆంత్రపాలజీ’ ఊపందుకుంది. పురుషాధిపత్య వాదనలు, వివరణలను సవాలు చేసింది. మన దేశంలో వర్గం, కులం, ప్రాంతాల వారీగా మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడంలో ఫెమినిస్ట్‌ ఆంత్రపాలజీ కీలక పాత్ర పోషించింది. ఉదాహరణకు దళిత మహిళలు పితృస్వామ్య భావజాలానికి మాత్రమే కాకుండా కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం గురించి విశ్లేషించింది.                                                       
 

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)