Breaking News

ఐ లవ్‌ యు డాడీ...

Published on Sat, 06/14/2025 - 04:12

నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి  పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది.  కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ..  పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!

ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా  పాల్గొంటున్నారు.  పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి  పాత్ర కనిపిస్తుంది.

భావోద్వేగాలకు ప్రాధాన్యం
ఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.

వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్ 
కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‌‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్‌ ఈవెంట్స్‌కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.

టెక్నాలజీతో అనుబంధం
ఈ డిజిటల్‌ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్‌ లైన్‌ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్‌ టూల్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.

ఆధునిక తండ్రి
మోడర్న్‌ ఫాదర్‌హుడ్‌ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్‌గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఉదాహరణగా తండ్రి
ఓ ఆధునిక తండ్రిగా, సింగిల్‌ ఫాదర్‌గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు.  పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.

కరణ్‌ జోహర్‌ సరోగసీ ద్వారా జుహీ, యష్‌ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్‌ డ్యాడ్‌గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. 

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)