Breaking News

పిల్లల్లారా. పాపల్లారా...స్ఫూర్తిగా నిలిచే కూనల్లారా...

Published on Fri, 11/08/2024 - 12:36

ఈ ప్రపంచంలో అన్నింటి కంటే విలువైనది బాలల ముఖాల్లో విరిసే చిరునవ్వు. సూర్యుడు, చంద్రుడు ఈ భూమ్మీదకు తొంగి చూసేది పిల్లల ముఖాన చిరునవ్వును చూడటానికే. గాలి వీచేది వారి ముంగురులను అల్లరి పెట్టి ఆడటానికే. నీరు ప్రవహించేది వారు కేరింతలు కొట్టడానికే. పిల్లల్ని సంతోష పెట్టడానికే అడవులు ఆకుపచ్చను పులుముకుంటాయి. పిల్లల్ని కళ్లు ఇంతింత చేసుకుని చూడటానికే మృగాలు వింత ఆకారాలు ధరిస్తాయి. నడయాడే ఈ బుజ్జి దేవతల కోసమే భూమి క్రమం తప్పకుండా తిరుగుతూ విరగకాసే పంటలను ఇస్తూ వారి నోటికి గోరు ముద్దలు అందేలా చూడటానికి తపన పడేది. పిల్లల కోసమే కదా తల్లిదండ్రులు ఆజన్మాంతం కష్టపడేది.

అయితే అందరు పిల్లలకూ అన్ని భాగ్యాలు దొరకవు. ప్రకృతి వారికి పరీక్షలు పెడుతుంది. వారికి సవాళ్లు విసురుతుంది. అందరితోపాటే మీరు కూడా అన్నట్టుగా వారి వాటాకు తగ్గ కష్టాలు ఇస్తుంది. అయితే పిల్లలకు మించిన వీరులు ఉండరు. వారిని మించిన శూరులు ఉండారు. కాసేపు చిన్నబుచ్చుకుంటారు కాబోలు. ఆ తర్వాత వారు తమ లోపలి శక్తిని వెలికి తెస్తారు. సవాళ్లకు జవాబు చెబుతారు. పెద్దవాళ్లకే స్ఫూర్తిపాఠాలు నేర్పిస్తారు.

నవంబర్‌ 14 బాలల దినోత్సవం.
ఈ సందర్భంగా రేపటి నుంచి తమ జీవితాల్లోని సవాళ్లను, అనారోగ్యాలను, ఏకాకితనాలను తట్టుకుని నిలబడ్డ బుల్లి హీరోలను కలిసి వారి ఉత్సాహాన్ని తోడు చేసుకుని ఆ సంతోషాన్ని పాఠకులకు పంచాలని సంకల్పించింది సాక్షి. సినిమా రంగంలోని ఛైల్డ్‌ సెలబ్రిటీలను వారివద్దకు తీసుకెళ్లి సందడి చేసింది. ఆ సందడి రేపటి నుంచి.

ఈ కథనాలు సాక్షి ఫ్యామిలీలో, సాక్షి టీవీలో, సాక్షి డిజిటల్‌ మీడియాలో వెలువడతాయి. పాఠకులు ఈ చిన్నారి సైనికులను కలవాలని, వారి బాటకు మీదైన ప్రోత్సాహం అందించాలని మా కోరిక. రేపటి నుంచి వాటికి  సంబంధించిన ప్రత్యేక కథనాలందిస్తాం. ఆలస్యం చేయకుండా చదివేయండి. 

సాక్షి టీవీ లిటిల్ స్టార్స్ స్పెషల్ డ్రైవ్ ప్రోమో

(చదవండి: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..)
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)