Breaking News

125 రోజుల పొట్టి కంది.. ఏడాదికి 3 పంటలు!

Published on Tue, 06/17/2025 - 04:03

కంది పంట సాగులో పెద్ద ముందడుగు పడింది. ఇప్పటి వరకు కంది అంటే కేవలం వర్షాకాలంలో విత్తుకునే ఖరీఫ్‌ పంట మాత్రమే. ఇక మీదట  ఏడాదికి 3 సార్లు విత్తుకోదగిన కంది పొట్టి రకం అందుబాటులోకి వచ్చింది. 45 డిగ్రీల అధిక వేడిని కూడా తట్టుకుంటూ హెక్టారుకు 2 టన్నుల వరకు దిగుబడినిచ్చే కంది వంగడాన్ని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్‌) శాస్త్రవేత్తలు రూపొందించారు. సీనియర్‌ బ్రీడర్‌ డా. గంగశెట్టి ప్రకాశ్‌ సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోనే తొలిసారి స్పీడ్‌ బ్రీడింగ్, స్పీడ్‌ చిప్పింగ్‌ పద్ధతుల్లో కంది వంగడాన్ని వెలువరించారు. అధిక వేడిని తట్టుకోగల 125 రోజుల్లో కోతకొచ్చే ఐసిపివి 25444 వంగడంతో 3 సీజన్లలోనూ కందులు పండించవచ్చని ఇక్రిశాట్‌ చెబుతోంది.

వచ్చే జనవరిలో..  
ఐసిపివి 25444 రకం కంది పంటను ఇక్రిశాట్‌ పొలంలో గత ఫిబ్రవరిలో విత్తాం. ఇప్పుడు కోతకొచ్చింది. ఈ రకాన్ని ఏ సీజన్‌లోనైనా సాగు చేయవచ్చు. ఖరీఫ్‌లో వరి సాగు చేసిన భూముల్లో రబీలో ఈ కంది రకాన్ని సాగు చేయొచ్చు. ఖరీఫ్, రబీల్లో వరుసగా వరి సాగు చేసే భూముల్లో.. వేసవిలో వేయొచ్చు. మొక్కజొన్న / కూరగాయలు సాగు చేసే భూముల్లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. కొందరు  రైతులకు 2026 జనవరిలో విత్తనాలు ఇస్తాం. వాణిజ్య పరంగా విత్తనాలు 
అందుబాటులోకి రావటానికి మరో 1.5 ఏళ్లు సమయం పడుతుంది. ఇది జన్యు సవరణ వంగడం కాదు. 
– డా. గంగశెట్టి ప్రకాశ్, సీనియర్‌ శాస్త్రవేత్త, కంది బ్రీడింగ్‌ విభాగం, ఇక్రిశాట్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)