Breaking News

పోర్టబుల్‌  కౌ లిఫ్ట్‌

Published on Tue, 07/22/2025 - 04:26

నిలబడలేకపోతున్న పశువులకు చికిత్స చేయించటం చాలా కష్టంతో కూడిన పని. సాధారణంగా పశువు ప్రసవించిన తర్వాత, కండరాల సమస్య వల్ల, సోలిపోయి పైకి లేవలేక పోవటం జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘డౌనర్‌ కౌ సిండ్రోమ్‌’ అంటారు. అలాంటి కష్టం వచ్చినప్పుడు ఏడెనిమిది మంది మనుషులు పట్టుకొని పశువును లేపి నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది పాడి రైతులకు, గోశాలల నిర్వాహకులకు, బాధిత పశువులకు కూడా చాలా బాధాకరమైన అనుభవం.

ఈ గడ్డు సమస్యను సులువుగా అధిగమించేందుకు ఉపయోగపడే ‘పోర్టబుల్‌ కౌ లిఫ్ట్‌’ అనే పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఐఐటీ బాంబేలోని రూరల్‌ టెక్నాలజీ యాక్షన్‌ గ్రూప్‌ (రుటాగ్‌)కు చెందిన మెకానికల్‌ ఇంజ నీరింగ్‌ ప్రొఫెసర్‌ తన్మయ్‌ కె భండార్కర్‌ ఈ సాంకేతికతను రూపొందించారు. సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్‌ ఫర్‌ రూరల్‌ ఏరియాస్‌ (సీటీఏఆర్‌ఏ)కు చెందిన ప్రొ. విశాల్‌ ఆర్‌. సర్దేశ్‌ పాండే ఈ డిజైన్‌కు మెరుగులు దిద్దారు. 

పశువును ప్రత్యేకంగా కుట్టిన జాకెట్‌ను పశువుకు చుట్టి, రెండు వైపుల నుంచి కొసలను పైకి తీసి, ఇరువైపులా నిలువుగా పది అడుగుల ఎత్తున ఉన్న ఇనుప చట్రం పైభాగంలో అమర్చిన గిలక ద్వారా గొలుసును సులువుగా లాగుతూ పశువును నిలబెట్టడానికి ఈ పరికరం ఉపయోగ పడుతుంది. డౌన్‌ కౌ సిండ్రోమ్‌ చికిత్సకు అనేక రోజుల సమయం పడుతుంది. 

అప్పుడు పశువును నిలబెట్టడానికి, ఒక చోటు నుంచి మరో చోటుకు నడిపించడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. 500–600 కిలోల బరువు గల పశువును ఇది నిలబెట్టగలదు. ఇప్పటికే అనేక గోశాలల్లో దీన్ని వాడి పరిశీలించి మెరుగు పరిచారు. ఐఐటీ బాంబే అనుమతితో ఈ పోర్టబుల్‌ కౌ లిఫ్ట్‌ను రుటాగ్‌ అనుమతితో జి.ఎన్‌. మంజునాథ తయారు చేసి రూ. 50 వేలకు విక్రయిస్తున్నారు. మొబైల్‌: 87226 49074. 
manju.genasinakuni@gmail.com

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)