Breaking News

సచిన్‌ మెచ్చిన గుమ్మడికాయ చికెన్‌ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్‌ చెఫ్‌

Published on Mon, 04/07/2025 - 16:54

మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్‌ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్‌ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్‌ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. 

ఆ చెఫ్‌ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్‌ చెఫ్‌ రన్నరప్‌ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్‌ టెండూల్కర్‌ పోస్టర్‌లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. 

చెఫ్‌ నంబీ  సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్‌ హీరోకి వండిపెట్టే ఛాన్స్‌ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్‌ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్‌ గారో, గుమ్మడికాయ చికెన్‌(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్‌ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్‌. 

వాటిన్నింటిలో సచిన్‌ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్‌ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్‌ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్‌ నంబీ.

(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)

 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)