Breaking News

రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..!

Published on Sun, 01/05/2025 - 16:31

రుమాలీ రోటీ ఎంత ఫేమస్‌ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్‌లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!

మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్‌ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. 

దీన్ని ఆలు కుర్మా, మటన్‌ లేదా చికెన్‌ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్‌లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు. 

ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది. 

మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది. 

ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్‌, తడ్కా వంటి కర్రీల గ్రేవ్‌తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్‌ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్‌లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా. 

 

(చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)