Breaking News

ఆఖరి మజిలీకి ఆమె చేయూత!

Published on Fri, 04/03/2026 - 04:08

చావులకు వెళ్లాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరైతే చావుకు వెళ్లినా అంత దూరాన ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తుంటారు. అలాంటిది కొందరు మహిళలు వారసత్వంగా వచ్చిన పాడె కట్టడం, చితి పేర్చడం, బొంద తవ్వడం వంటి వృత్తులు నిర్వహిçస్తూ, ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అలాంటి పనులు మగవారే చేస్తుంటారు. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలే అన్నీ తామై పాడె కట్టడం నుంచి చితిని పేర్చి శవం కాలి బూడిదయ్యేదాకా అన్నీ తామై వారసత్వంగా వస్తున్న ఆ వృత్తిలో ఆఖరి మజిలీ వరకు చేయూతనిస్తున్నారు. 

కామారెడ్డి పట్టణంలో ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే అంత్యక్రియలకు అవసరమైన కుండతో పాటు పాడె కట్టడానికి అవసరమైన కట్టెలు తీసుకుని వెళతారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి డప్పుల చప్పుడు మధ్యన పాడె కడతారు.  శవాన్ని పాడె మీద పడుకోబెట్టగానే బట్ట కప్పేసి శవం పడిపోకుండా తాడుతో కట్టేస్తారు. మరో బృందం చితికి అవసరమైన కట్టెలు తీసుకువచ్చి శ్మశానవాటికలో పేర్చి, శవాన్ని చితిపై పడుకోబెట్టగానే కట్టెలతో నింపేస్తారు. కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగానే, దహనమయేదాకా అక్కడే ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్లు శవాలను ఖననం చేస్తుంటారు. అలాంటి పనుల్లో శవాన్ని ఖననం చేయడానికి గుంత తవ్విన తరువాత శవాన్ని అందులో పూడ్చేసే కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారు. కామారెడ్డి పట్టణానికి చెందిన వారంతా పట్టణంతో పాటు దేవునిపల్లి, క్యాసంపల్లి, సరంపల్లి గ్రామాల్లో చనిపోయిన వారి ఆఖరి మజిలీలో తమ పాత్ర పోషిస్తున్నారు. 

కరోనా అప్పుడు కూడా పనిచేసినం
నేను నలభై ఏండ్ల సంది పాడె కడుతున్న. ఎవరు చనిపోయినా వచ్చి మాట్లాడుకుని వెళతారు. చావుకు అవసరమైన కుండ, పాడె కట్టెలు కొనుక్కుని వెళతాం. ఇంటిముందర కుండలో అన్నం వండి ఇవ్వడం నుంచి పాడె కట్టడం, శవాన్ని పాడెమీద పడుకోబెట్టి తీసుకువెళ్లేదాకా అన్ని పనులు చూసుకుంటాం. ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగిస్తుంటాం. అయితే మేము చేసేది పుణ్యకార్యంగానే భావిస్తాం. కరోనా సావులు కూడా చేసినం.
– బైరం సిద్దవ్వ

ఇరవై ఏండ్ల సంది చేస్తున్న...
నేను ఇరవై ఏండ్ల సంది వృత్తిలో ఉన్న. మా కుటుంబ వారసత్వంగా వచ్చిన దానిని అలాగే కొనసాగిస్తున్నం. పెద్ద ఊరు కావడం వల్ల ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు సావులు కూడా చేయాల్సి ఉంటది. ఆ రోజు తినడానికి కూడా టైం సరిపోదు. అన్ని సావుల కాడికి వెళ్లాలి. పాడె కట్టాలి. జీవితం ఉన్నన్ని రోజులు చేయాల్సిందే. ఇబ్బందే అయినా బతకుదెరువుకు చేయాల్సిందే. 
– బైరం హేమలత

– సేపూరి వేణుగోపాలచారి, 
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)