Breaking News

సముద్రంలో రెస్టారెంట్‌.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు

Published on Thu, 09/28/2023 - 14:51

సముద్రంలో రెస్టారెంట్‌

సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్‌. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్‌’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్‌ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్‌లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్‌ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్‌ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. 

విగ్గుతో గిన్నిస్‌ రికార్డ్‌

విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ డానీ రేనాల్డ్స్‌ రూపొందించిన అతిభారీ విగ్‌ గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్‌ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్‌ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)