విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని..

Published on Fri, 02/13/2026 - 13:24

ప్రేమించుకోవడం కంటే దాన్ని కడదాక నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమికులు అవ్వగలిగినంత ఈజీగా..మంచి ఆలుమగలు అనిపించుకోలేరు చాలామంది. వివాహ బంధంలో మనస్పర్థలనేవి కామన్‌..వాటిని అధిగమించి అన్నివేళలా ఒకరికొకరుగా సాగడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లు ప్రేమికులుగానూ..దపంతులుగానూ గెలిచి..అందరికీ ఆదర్శంగాన నిలుస్తుంటారు. ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే నేపథ్యంలో ప్రేమను కడదాక ఉంచుకుని..విజయవంత చేసుకుని..అందరిచేత గొప్ప సెలబ్రిటీ జంటగా పిలిపించుకుంటున్న రితేష్‌ జెనీలియా క్యూట్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.

రితేష్‌-జెనీలియాలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెళ్లై 14 ఏళ్లు అయినా..ఏ ఈవెంట్లో అయినా..జంటగా కనిపించి సందడి చేస్తుంటారు. దపంతులంటే వీళ్లలా ఉండాలి అనేలా ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపించే ఈ జంట లివ్‌ఇన్‌రిలేషన్‌షిప్‌కి దూరం అంటే ఒప్పుకుంటారా..!?. ఔను..! ఇది నిజం. సినిమా షూటింగ్‌లు నిమిత్తమైన ఇరువురు వేరుగా.. స్నేహితులతోనే ఉండేవారట. 

అంతేగాదు అందరిలా డేటింగ్‌ చేయకుండా హద్దుల్లో ఉంటూనే ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దాంపత్యం గురించి పలు విషయాలు సానియా మీర్జా పాడ్‌కాస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు కూడా. ​తాము ఎప్పుడు పెళ్లికి ముందు ఒకే గదిలో కలిసి ఉండటం వంటివి చేయలేదని అన్నారు. కానీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా..ఒకరి జీవితంలో ఒకరు ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాకే..తాము కలిసి ఉన్నామని, అంతకుమునుపు షుటింగ్‌ సమయంలో కూడా స్నేహితులతోనే ఉండేవాళ్లమని అన్నారు. 

అయినా ఇంతలా అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు అని అందరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అవగాహన..ప్రతీది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే..బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందంటున్నారు ఇద్దరు. మధ్యలో జెనీలియా కల్పించుకుంటూ..తనకంతా రితేషేనని. తన ప్రేమ, ఇష్టం, కన్నీళ్లు ఏదైనా రితేష్‌ అని చెబుతుంది. 

తనకు కంటనీరు రాక మునుపే రితేష్‌కి అర్థమైపోతుంది. తనతో ఉన్నవాళ్లకు ఎవ్వరైనా..రితేష్‌ ఎంతలా కనెక్ట్‌ అవ్వుతాడో ఇట్టే అర్థమైపోతుంది. అతని కేరింగ్‌ కూడా అద్భుతమని అంటోంది జెనీలియా. తనెప్పుడు నాతోనే ఉన్న అనుభూతే కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే  24/7 అనోచ్చు అని నవ్వుతూ చెప్పింది జెనీలియా. అంతేగాదు ఆ పాడ్‌కాస్ట్ చివరలో మా ఆయన బంగారం అంటూ నవ్వేసింది ఈ అందాల హాసిని..

(చదవండి: నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..!)

 

Videos

మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్

మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు

జోరుమీదున్న వెంకీ మామ ఏకంగా లైన్ లో 7 సినిమాలు

Arjun Sarja: రోజుకో గంట మీ శ‌రీరానికి ఇచ్చుకోండి లైఫ్‌లో ఫిట్‌గా ఉంటారు

కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి.. కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

మున్సిపల్ రిజల్ట్పై BRS క్రిశాంక్ కామెంట్స్

ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు

దోచుకోవడమే వీళ్లకి తెలుసు స్టాలిన్ పై విజయ్ ఫైర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్.. కార్యకర్తల సంబరాలు

రేణిగుంట నారాయణ కాలేజీలో దాష్టీకం విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

Photos

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )

+5

విశ్వక్‌ సేన్‌ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కశ్మీర్‌ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష‍్మీరాయ్ (ఫోటోలు)

+5

శ్రీశైలం: నల్లమల అడవుల్లో భక్తుల పాదయాత్ర (ఫోటోలు)

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)