Breaking News

ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..?

Published on Wed, 07/10/2024 - 15:27

ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఖర్జూరం తీసుకుంటే మలబద్దకం వస్తుందా?. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉందా?. అంటే ఔననే చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రీజన్‌ ఏంటో సవివరంగా చూద్దామా..!.

మలబ​ద్ధకం అనేది సాధారణ సమ్య. దీనిని సరైన ఆహారం, జీవనశైలితో సర్దుబాటు చేయవచ్చు. సహజ చక్కెరలకు, ఖనిజాలకు అద్భుతమైన ఈ ఖర్జూరం మలబద్ధకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. దీనిలో పుష్కలంగా ఫైబర్‌ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి..మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది. 

ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీర్ణం కావడం కష్టమవుతుంది. శరీరం లోపల అగ్నిని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాకాకుండా వాటిమీద మక్కువకొద్ది లాగిస్తే సమస్యలు తప్పవని చెబుతున్నారు నిఫుణలు.

ఎలా తీసుకుంటే బెటర్‌..

  • నానాబెట్టిన ఖర్జూరాలు బరువు తగ్గించేందుకు, జీర్ణక్రియకు మంచిది. 

  • ఖర్జూరాలు తినే ముందు ఎండు అల్లం పొడిన జోడించండి. పొడి అల్లం లేదా సాంత్‌ ఆహారాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. 

  • అంతేగాదు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అత్తిపండ్లతో కూడిన 'ఖజురాధి మంథా'ని తయారు చేయడానికి ఒక కూలింగ్ డ్రింక్ సిద్ధం చేయండి. ఈ రిఫ్రెష్‌ డ్రింక్‌ జీర్ణ సమస్యలను నివారించి, హైడ్రేట్‌గా ఉంటుంది. 

  • మంచి ప్రయోజనాలను పొందాలంటే రోజుకు మూడు ఖర్జూరాలను స్నాక్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యానికి కూడా మంచిందని చెబుతున్నారు. 

(చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగనీటిని ట్రై చేయండి..!)
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)