Breaking News

చరిత్ర సృష్టించిన చిత్రం..!

Published on Tue, 02/25/2025 - 08:45

శుచి తలాటీ రచించి, దర్శకత్వం వహించిన ‘గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ 40వ ఇండిపెండెంట్‌ స్పిరిట్‌ అవార్డ్స్‌లో జాన్‌ కాసావెట్‌ అవార్డును గెలుచుకుంది. హిమాలయన్‌ బోర్డింగ్‌ స్కూల్లో చదివే మీరా అనే టీనేజర్‌ ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే చిత్రం ఇది.

‘నా దృష్టిలో ఇది తల్లీకూతుళ్ల ప్రేమ కథ. అయితే సంక్లిష్టమైన ప్రేమ కథ. ఈ సినిమా ద్వారా రెండు తరాలకు చెందిన మహిళల స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను చెప్పే ప్రయత్నం చేశాం’ అని తన చిత్రం గురించి చెప్పింది శుచి తలాటీ.

జాన్‌ కాసావెట్‌ అవార్డ్‌ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ చరిత్ర సృష్టించింది. మిలియన్‌ డాలర్‌ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రానికి ఈ అవార్డ్‌ ఇస్తారు. ప్రముఖ నటులు రిచా చద్దా, అలీ ఫజల్‌ ‘గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌’ను నిర్మించారు.

‘ఈ విజయం ఒక కలలా అనిపిస్తోంది. ఎప్పుడో కన్నకల సాకారం అయినట్లుగా అనిపిస్తోంది. ఇది ఒకరి వ్యక్తిగత విజయం కాదు. సమష్టి కృషికి దక్కిన విజయం. ఇండిపెండెంట్‌ స్పిరిట్‌ అవార్డ్‌ గెలుచుకున్న తొలి భారతీయ నటిగా, నిర్మాతగా ఇది నా విజయం మాత్రమే కాదు వైవిధ్యమైన కథలను రూపొందించడానికి కృషి చేస్తున్న అందరి విజయం’ అంటుంది రిచా చద్దా.‘నా దృష్టిలో ఇది కేవలం అవార్డు కాదు. కథలోని బలానికి దక్కిన గౌరవం’ అంటుంది శుచి తలాటి. 

(చదవండి: ఒక్క ఏడాదికే 26 కిలోలు తగ్గాడు..! బాగా చేశారంటూ హీరో హృతిక్‌ ప్రశంసల జల్లు..)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)