Breaking News

Sri Rama తిరిగి రా, స్వామీ!

Published on Fri, 06/06/2025 - 10:43

‘లోక హితం కోసం నేను శ్రీరాముడిగా మానవ అవతారంలో జన్మిస్తాను. లోక కంటకుడయిన రావణాసురుడిని వధిస్తాను. ఆ తరవాత పదకొండు వేల సంవత్సరాలు భూలోకంలోనే ఉండి రాజ్యం చేస్తాను’ అని శ్రీహరి బ్రహ్మాది దేవతలకు వాగ్దానం చేయటం రామాయణం బాలకాండ ఆరంభంలో కనిపిస్తుంది. అలా మానవ రూపంలో జన్మనెత్తిన తరువాత, శ్రీరాముడు ‘నేను భగవదవతా రాన్ని!’ అని ఎక్కడా చెప్పలేదు. తనను తాను మానవమాత్రుడిగానే భావించుకొని, ధర్మమూర్తిలా జీవించాడు. 

దేవతల కిచ్చిన వాగ్దానం ప్రకారం లంకేశ్వరుడిని వధించాడు. పదకొండు వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రామరాజ్యాన్ని సాగించాడు. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం భూమి మీది ప్రజలు చల్లగా, సుఖంగా ఉన్నారు. కానీ హరి తమకు దూరమవడంతో, దేవతలకు మాత్రం ఆ కాలమంతా క్షణమొక యుగంగా గడిచింది. అనుకొన్న పదకొండు వేల సంవత్సరాల అవధి పూర్తి కాగానే, బ్రహ్మదేవుడు కాలపురుషుడిని తన దూతగా శ్రీరాముడి దగ్గరకు పంపాడు. ఆయన సందేశం ఇది: ‘దేవా! నువ్వు వైకుంఠానికి తిరిగి రావలసిన సమయం వచ్చిందని సవినయంగా గుర్తు చేస్తున్నాను. అయినా మరికొంత కాలం భూలోకంలో ఉండాలని నీకు అనిపిస్తే అలాగే చేయి. లేక ముందు అనుకొన్న ప్రకారం తిరిగి వస్తావా, దేవతలందరూ నీ రాకతో మరింత నిశ్చింతగా జీవించ గలుగుతారు. నిర్ణయం నీది!’ 

మానవావతారంలో ఉన్న మాధవుడు ‘నేను ఇన్నాళ్ళుగా ఇక్కడ ఉన్నది త్రిలోక క్షేమ కారణమయిన పని మీద! అది పూర్తయింది. కాబట్టి నా వశవర్తులుగా నడుచుకొనే దేవతా గణానికి, ఎప్పటిలాగే అన్ని విష యాలలోనూ అండగా ఉండటం నా కర్తవ్యం. త్వరలోనే నేను తిరిగి వస్తున్నాను’ అని సమాధానం పంపాడు. తరవాత కొద్ది కాలానికే రామావతారం చాలించి, పరంధామానికి తిరిగి వెళ్ళాడు. రామావతార సమాప్తి గురించిన ఆసక్తికరమైన వృత్తాంతం రామాయణం ఉత్తర
కాండలో కనిపిస్తుంది.

–ఎం. మారుతి శాస్త్రి 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి