నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండే...  రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌! 

Published on Sun, 07/02/2023 - 08:02

కొందరిని గమనిస్తే... కుర్చీలో కూర్చుని కాళ్లు రెండూ కదుపుతూ ఉంటారు. వాళ్లు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా... అలా కదిలించడం వారికి ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ వారు బలవంతంగా దాన్ని నియంత్రించుకుంటే... అది వారికి అనీజీగా అనిపించి... కాసేపటి తర్వాత తమ ప్రమేయం లేకుండానే మళ్లీ కదిలించడం మొదలుపెడతారు. జనాభాలో దాదాపు 3 శాతం మందిలో ఇది ఉంటుంది. ఇలా కాళ్లు కదుపుతూ ఉండే సమస్యను ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ (ఆర్‌ఎల్‌ఎస్‌) అంటారు. చాలామందిలో ఉండే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. 

కాళ్లు రెండూ అదేపనిగా కదుపుతూ ఉండే ఈ సమస్య కూర్చుని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... ఇలాంటివారిని జాగ్రత్తగా గమనిస్తే...  ఈ ధోరణి సాయంత్రాలూ, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. వైద్య పరిభాష లో దీన్ని ‘విల్లిస్‌ ఎక్‌బామ్‌ డిసీజ్‌’ అని కూడా అంటారు. ఇది ఏ వయసువారిలోనైనా కనిపించినప్పటికీ... వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కనిపించే అవకాశాలు పెరుగుతాయి. కొందరిలో ఇది ఎంత ఎక్కువ అంటే... వారి నిద్రకు సైతం ఇది అవరోధంగా మారుతుంది. కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లోని చాలామందిలో అనువంశికంగా ఈ సమస్య కనిపిస్తుంది. 

కారణాలు: ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు... త్వరగా ఉద్వేగాలకు లోనయ్యేవారు, అతిగా ఆందోళన పడేవారు, యాంగై్జటీకి గురయ్యేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇది ఎక్కువ. . 

లక్షణాలు: ∙కొందరిలో కాళ్లలో ఇబ్బంది పైకి పాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ∙కాళ్లు కదుపుతూ ఉంటారు. కాళ్లు కదపడం ఆపితే చాలా ఇబ్బందిగానూ, అలా కదుపుతుంటే హాయిగాను ఫీలవుతారు. ∙ఇలా కదిపే వాళ్లలో రాత్రి నిద్రలో అకస్మాత్తుగా కాలి కండరాలు పట్టేస్తాయి. దాంతో అకస్మాత్తుగా నిద్రలేస్తారు. ఒక్కోసారి రాత్రంతా బాధపడతారు. తరచూ నిద్రాభంగాలు, దాంతో వచ్చిన నిద్రలేమితో జీవన నాణ్యత దెబ్బతింటుంది. ∙ఈ లక్షణాలున్న కొందరిలో కాళ్లలాగే భుజాలూ కదపడం కనిపిస్తుంది. కానీ ఇది చాలా అరుదు. 

అపోహ... వాస్తవం: రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌ను కొందరు మానసిక సమస్యనూ, మెదడు లేదా నాడీమండల సమస్యగానూ భావిస్తారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. కాకపోతే యాంగై్జటీతో పాటు కొన్ని మానసిక సమస్యలు ఉన్నవారిలో ఇది కనిపిస్తుండటం అనే అంశమే ఈ అపోహకు తావిస్తోంది. అంతే తప్ప ఇది మెదడు, నాడీ సంబంధమైన సమస్య లేదా మానసిక సమస్య కాదు.  కొంతమంది ఇది నరాల్లోని సమస్యగా భావిస్తారు. ఇది సరి కాదు. 

నివారణ / నియంత్రణ 
రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌ ఉన్నవారిలో హీమోగ్లోబిన్‌లో ఐరన్‌ లోపం ఉందేమో చెక్‌ చేసుకుని, ఒకవేళ ఉంటే దాన్ని భర్తీ చేయాలి. ∙కెఫిన్‌ ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ∙కాళ్లు రెండూ గోరువెచ్చగా ఉన్న వేణ్ణీళ్ల టబ్‌లో ఉంచి, మెల్లగా మసాజ్‌ చేయడం. ∙సమస్య తీవ్రత ఉన్నవారు ‘ఫుట్‌ ర్యాప్‌ లేదా వైబ్రేటింగ్‌ ప్యాడ్స్‌’ వంటి ఉపకరణాలను డాక్టర్ల సూచన మేరకు వాడటం.  

-డాక్టర్‌ కె. శివరాజు,సీనియర్‌ ఫిజిషియన్‌
(చదవండి: మీలో ఏకాగ్రత ఎంత ఉంది? అందుకోసం ఏం చేయాలంటే)

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)