Breaking News

ముఖేష్‌ అంబానీ ‘లడ్డూ రివర్స్‌’ వీడియో వైరల్‌, అసలు నిజం ఇది!

Published on Wed, 03/06/2024 - 15:37

బిలియనీర్, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ముఖేష్‌ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు.

"ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్‌  తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి)  అనే  పేరుతో  పోస్ట్‌ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్‌గా రూపొందించిన ఫేక్‌ వీడియో ఇది. 

కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్‌లో తెగ షేర్‌ అవుతోంది.  ముఖేష్ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ  వీడియోపై కమెంట్‌ చేశారు. అయితే ఇది రివర్స్‌ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది.  మరి కొంతమంది యూజర్స్‌  జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 

ఇదీ అసలు వీడియో..

కాగా అనంత్‌ అంబానీ తన లేడీ లవ్‌ రాధికా  మర్చంట్‌తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు.  గత ఏడాది  ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ  లవ్‌బర్డ్స్‌ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్‌ బాష్‌ నిర్వహించారు. బాలీవుడ్‌సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్‌గేట్స్‌, మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సహా పలువురు ప్రపంచ బిజినెస్‌ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)