Breaking News

మై లిటిల్‌ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!

Published on Sun, 11/17/2024 - 10:08

చిన్నపిల్లలకు కథలు చెబుతుంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు మొబైల్‌లో వారికి కావాల్సినవి పెట్టి పడుకోబెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా కొన్ని పరిశోధనలు నిద్రపోవడానికి ముందు అరగంట సమయం పిల్లల మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిర్ధారించాయి. మొబైల్‌ వల్ల పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ‘మై లిటిల్‌ మార్ఫీ’నీ రూపొందించారు. 

ఇందులో చిన్నారుల ప్రశాంతమైన నిద్ర కోసం 128 కథలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే 32 రకాల ధ్యానాలు, పిల్లి, కుక్క, ఏనుగు వంటి 16 జంతువుల ధ్వనులు, సముద్ర కెరటాలు, గాలి, నీటి తుంపరలు, మంటల చిటపట శబ్దాలతో పాటు ‘మై లిటిల్‌ మార్ఫీ’ కోసం ప్రత్యేకంగా కంపోజ్‌ చేసిన 16 శ్రావ్యమైన సంగీత స్వరకల్పనలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో రికార్డ్‌ చేసిన ప్రకృతి శబ్దాలున్నాయి. 

ఇలా మొత్తం మై లిటిల్‌ మార్ఫీ 192 సెషన్‌లను 5 థీమ్‌లుగా విభజించింది. పడుకునే ముందు మన కిష్టమైన సెషన్‌ , ఆ సెషన్‌ వ్యవధిని ఎంచుకుంటే చాలు. అది వింటూ హాయిగా నిద్ర పోవచ్చు. చిన్నారులకే కాదు ఈ పరికరం అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన నాణ్యతతో వాయిస్‌ రికార్డింగ్‌ చేసుకునే వీలుండటం విశేషం. 

దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే సుమారు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అంటే మొత్తం ఎనిమిది కథలు, పదహారు పాటల వరకు వినొచ్చు. ధర 8 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. 

(చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)