Breaking News

రెక్కల రామక్క జాతర

Published on Wed, 02/19/2025 - 17:16

ఆదివాసీ సమాజంలో ఇలవేల్పు జాతరలు అత్యంత ప్రధానమైనవి. ప్రతి ఏడాదీ మాఘ పున్నమి తరువాత తమ తమ కులదేవతలకు జాతరలను జరపడం ఆదివాసీల ఆచారం. ప్రతి తెగలో వంశాలు, ఇంటిపేర్లు బట్టి కులదేవతలు ఉంటారు. కోయ తెగవారిలో ఉన్న వంశాలను ‘గొట్లు’గా పిలుస్తారు. బేరంబోయిన వంశానికి చెందిన వారిది ఈ గొట్లలో ఒకటి. ఈ వంశానికి చెందిన కొమరం ఇంటి పేరు ఉన్న వారి ఇల వేల్పు ‘రెక్కల రామక్క.’ వీరు రెండేళ్లకొక మారు ఆమెకు జాతర జరపడం తరతరాలుగా వస్తోంది.   భద్రాది–కొత్త గూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం, నడిమి గూడెంలో ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుండి 21 వరకు జాతర జరుగుతోంది.  

ప్రచారంలో ఉన్న కథ ప్రకారం–బేరంబోయిన రాజు కోయల్లో గొట్టు – గోత్రాల వ్యవస్థ ఏర్పాటు చేశారని నమ్ముతారు. ఈ రాజునే కార్తీక రాజు అంటారు. ఆయన భార్య మూడవ గట్టుకు చెందిన కాకేరి పూజారి గోత్రం అడ బిడ్డ వరందేవి. ఈమెనే ఆదిశక్తిగా కూడా పిలుస్తారు. రెక్కల రామక్క(పక్షి) రూపంలో బేరంబోయినవారు ఈమెను కొలుస్తున్నారు. జాతర సందర్భంగా ఈమెకు బోనం సమర్పిస్తారు. అలాగే ఈ దేవతకు (వంశానికి) సంబంధించిన ‘పడిగ’ జాతరలో ప్రత్యేక ఆకర్షణ. పడిగపై చిత్రలిపి ఉంటుంది. పడిగ అంటే కోయ తూర్‌ సమాజంలో ‘ఇంటికి పెద్ద కొడుకు’ అని అర్థం. అంటే కుటుంబాన్ని రక్షించేవాడు. మధ్య భారతంలోని కోయతూర్‌ సమాజం పడిగలను అతి పవిత్రంగా పూజిస్తూ వేల్పుగా కొలుస్తారు. ఈ పడిగ త్రిభుజ ఆకారంలో ఉండే ఎర్రని గుడ్డ. దీనిపై బొమ్మలు ఉంటాయి. 

జాతరకు వచ్చే వంశస్థులు తమ పడిగను తీసుకు వస్తారు. అక్కడ ‘డోలి’వారు వారిని కూర్చోబెట్టి పడిగలోని చిత్రలిపిని చూపి రేల పాటలతో ఆ వంశ చరిత్రను మొత్తం చెబుతారు. జాతర్లలలో పడిగలకు పసుపు, కుంకుమలు రాసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. జాతర అయిపోయినాక ఈ పడిగలను తీసుకెళ్ళె అతి పవిత్రంగా దాచి... మరలా రెండేళ్ళకు జాతర నాడు మాత్రమే పూజలు చేసి బయటకు తీసి ఆడిస్తారు.

– వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌
(ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు రెక్కల రామక్క జాతర)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)