Breaking News

Recipe: ఇడియప్పం పులిహోర తయారీ ఇలా!

Published on Thu, 08/04/2022 - 14:30

పండుగ సీజన్‌లో ఇలా ఇడియప్పం పులిహోర తయారు చేసుకోండి!
కావలసినవి:  
►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు
►నీళ్లు – కొద్దిగా
►మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు
►నెయ్యి – 1 టీ స్పూన్‌

►ఆవాలు, ధనియాలు, మినపగుళ్లు, జీలకర్ర, శనగపప్పు, జీడిపప్పు, వేరుశనగలు – కొన్నికొన్ని చొప్పున
►ఎండు మిర్చి – 1 (రెండు ముక్కలు అడ్డంగా తుంచి)
►పచ్చిమిర్చి – 3 (మధ్యలోకి చీరి)

►నూనె – సరిపడా
►ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు
►కరివేపాకు – 2 రెమ్మలు, నిమ్మకాయ – 1

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి.
►తర్వాత ఇడ్లీ పాన్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకుని, మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్‌ ఉండే ప్లేట్‌ని అమర్చాలి
►అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని, ప్రతి ఇడ్లీ గుంతలో.. గుండ్రంగా తిప్పుతూ, గట్టిగా ఒత్తితే నూడుల్స్‌లా వస్తాయి.
►వాటిని ఆవిరిపై ఉడికించి, చల్లారాక.. ఒక్కో ఇడ్లీ ఇడియప్పాన్ని నాలుగైదు ముక్కలుగా విడదీసుకోవాలి.

►అనంతరం స్టవ్‌పైన కళాయి పెట్టి.. 2 లేదా 3 టేబుల్‌ స్పూన్ల నూనె వేయాలి.
►తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్లు, పసుపు, ధనియాలు, జీడిపప్పు, వేరుశనగలు, ఎండు మిర్చి.. పచ్చిమిర్చి.. కరివేపాకు ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి.

►అందులో నిమ్మరసం వేసి కాసేపు తిప్పాలి.
►అనంతరం ఇడియప్పం మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో కలియదిప్పుకోవాలి. 
ఇవి కూడా ట్రై చేయండి: Paneer Vegetable Idli Recipe: పన్నీర్‌ వెజిటబుల్‌ ఇడ్లీ, కోకోనట్‌ పాన్‌కేక్‌ తయారు చేసుకోండిలా!
Surnali Dosa Recipe: సూర్నాలి దోశ ఎప్పుడైనా తిన్నారా? ఇలా తయారు చేసుకోండి!

Videos

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)