Breaking News

పిల్లలు భలే నవ్వుతారు కదా.. సైన్స్‌ ఏం చెబుతోందంటే..!

Published on Sat, 04/26/2025 - 13:11

పిల్లలూ... మిమ్మల్ని మీరు గమనించారా? మీరు ఎక్కువగా నవ్వుతుంటారు. పిల్లలు ఊరికూరికే నవ్వుతారు. ఊహ తెలిసిన పిల్లలే కాదు పసికందులు కూడా ఊరికూరికే నవ్వుతారు. ఎందుకలా నవ్వుతారు? పిల్లలకు నవ్వు అంత ఇష్టమా?

పిల్లలు మాటలు వచ్చేంత వరకు రెండు రకాలుగా మాత్రమే కమ్యూనికేట్‌ చేయగలరు. ఒకటి నవ్వడం, రెండవది ఏడవడం. ఆకలేసినప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు లేదా ఏదైనా నొప్పి కలిగినప్పుడు ఆ భావాలని ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తారు. మరి ఎందుకు నవ్వుతారు? పెద్దవాళ్లు సగటున రోజుకు 15–20 సార్లు నవ్వితే,పిల్లలు మాత్రం రోజుకి 300–400 సార్లు నవ్వుతారు. ఎందుకింత వ్యత్యాసం. అసలు పిల్లలు అన్ని సార్లు ఎలా నవ్వుతారో ఇప్పుడు తెలుసు కుందాం.

పిల్లల మెదడు ఆనందాన్ని  సులభంగా పట్టుకుంటుంది...
చిన్న పిల్లల మెదడు చాలా సరళంగా ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషం చూస్తారు. ఉదాహరణకు బెలూన్‌ గాలిలో తేలడం, కుక్కపిల్ల గెంతుతూ ఆడుకోవడం లాంటి సంఘటనలన్నీ వాళ్ళకి వింతగా తోస్తాయి దాంతో కిలకిలా నవ్వేస్తారు!

నవ్వు వాళ్ళకు ఒక భాష లాంటిది...
పిల్లలు ఇంకా పూర్తిగా మాట్లాడడం నేర్చుకోక ముందు నవ్వడం ద్వారా తమ భావాలను చూపిస్తారు. ఒక బొమ్మ నచ్చితోనో, అమ్మ జోల΄ాటలో మాధూర్యం నచ్చితేనో వాళ్ళు నవ్వుతూ తమ ఆనందాన్ని షేర్‌ చేస్తారు. ఇది వాళ్ళకు సహజంగా వచ్చే కమ్యూనికేషన్‌!

సైన్స్‌ ఏం చెప్తుంది?
నవ్వడం వల్ల మెదడులో ‘డోపమైన్‌‘ అనే హ్యాపీ కెమికల్‌ విడుదల అవుతుంది. పిల్లల మెదడు ఈ డోపమైన్ను చాలా త్వరగా, సులభంగా రిలీజ్‌ చేస్తుంది. అందుకే వాళ్ళు ఒక చిన్నపాటి చక్కిలిగింతకి కూడా  పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.

పిల్లలు క్యూరియస్‌ ఎక్స్‌ప్లోరర్స్‌...
పిల్లలు ప్రపంచాన్ని ఒక అద్భుతంగా చూస్తారు.  కాగితం ముక్కను చించడం, బబుల్‌ పగలడం, లేదా నీవు వాళ్ళతో సిల్లీ గేమ్‌ ఆడడం – ఇవన్నీ వాళ్ళకు కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. ఈ కొత్త అనుభవాలు వాళ్ళను నవ్విస్తాయి.

సామాజిక కారణం...
పిల్లలు తమ చుట్టూ ఉన్నవాళ్ళను గమనిస్తారు. నీవు నవ్వితే వాళ్ళూ నవ్వుతారు. దీన్ని ‘మిర్రర్‌ న్యూరాన్స్‌ అంటారు. వాళ్ళ మెదడు ఇతరుల భావాలను కాపీ చేస్తుంది. అందుకే చిన్నతనంలో అమ్మ నవ్వితే తిరిగి నవ్వడం, ఏడిస్తే పిల్లలూ ఏడవడం మనం తరచూ చూస్తుంటాం. 

ఇదీ చదవండి:  సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
                                   

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)