Breaking News

అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!

Published on Tue, 10/24/2023 - 08:22

అరటికాయ మంచూరియాకు కావలసినవి:  

అరటికాయలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక తొక్క తీసి, గుజ్జులా చేసుకోవాలి)
మైదాపిండి – 4 టేబుల్‌ స్పూన్లు
కార్న్‌ పౌడర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
గోధుమ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు
అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌
కారం – 1 టీ స్పూన్‌
జీలకర్ర – అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌ (చిన్నగా తరగాలి)
పచ్చిమిర్చి – 1 (చిన్నగా తరగాలి)
కొత్తిమీర తురుము, కరివేపాకు – కొద్ది కొద్దిగా (అభిరుచిని బట్టి)
ఉల్లికాడ ముక్కలు – కొద్దిగా
టొమాటో సాస్‌ – 3 లేదా 4 టేబుల్‌ స్పూన్లు
చిల్లీసాస్‌ – 2 టీ స్పూన్లు
సోయా సాస్‌ – 1 టీ స్పూన్‌ (పెంచుకోవచ్చు)
నూనె – సరిపడా
ఉప్పు – తగినంత

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటికాయ గుజ్జు, మైదాపిండి, కార్న్‌ పౌడర్, గోధుమపిండి, అల్లం – వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని.. అందులో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీసాస్, టొమాటోసాస్, సోయాసాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుని.. ఉల్లికాడ ముక్కలతో గార్నిష్‌ చేసుకుని, సర్వ్‌ చేసుకోవాలి. 

(చదవండి: స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మరసాన్ని జత చేస్తున్నారా! ఐతే ఈ సమస్యలు తప్పవు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)