Breaking News

సెహ్రీ..తెల్లవారే ముందు వంటకాల విందు..!

Published on Fri, 03/28/2025 - 11:13

మతాలకతీతంగా ప్రతి నగరవాసి సంప్రదాయ ఆహార సంస్కృతిలో మమేకమైపోయే సమయం రంజాన్‌. పాతబస్తీని అంతగా పట్టించుకోని ఐటీ నిపుణులు సైతం అసలు సిసలు హైదరాబాద్‌ అనుభవం కోసం ఓల్డ్‌ సిటీకి రౌండ్స్‌ కొట్టే సీజన్‌ ఇది. ఓ రకంగా దీన్ని లోకల్‌ టూరిజం అని పేర్కొనవచ్చు. రంజాన్‌ సీజన్‌లో ఈ లోకల్‌ టూరిస్టులు ఆస్వాదించే వాటిలో హలీమ్, ఇఫ్తార్‌లు మాత్రమే కాదు సెహ్రీ కూడా ఒకటి. 

రోజూ రకరకాల కారణాలతో.. రంజాన్‌ సమయంలో నగరం సెహ్రీ ప్రత్యేక మెనూల కోసం మేల్కొంటోంది. ఇది ముస్లింలు తమ రోజాను (ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేసే ఉపవాసం) పునఃప్రారంభించే ముందుగా.. సూర్యోదయానికి ముందు తినే ఉదయపు భోజనం. అయితే ఈ సమయం సాధారణంగా ముస్లిమేతరులు ఎవరికీ అనుభవంలో లేని తెల్లవారుజామున ఆస్వాదించే  వైవిధ్యభరిత అనుభూతి. సమయం మాత్రమే కాదు ఆ సమయానికి రెస్టారెంట్స్‌ వడ్డించే వంటకాలు కూడా ప్రత్యేక అనుభూతే.  

వైవిధ్యభరిత అనుభూతి.. 
సెహ్రీ కోసం బయటకు వెళ్లడం సంప్రదాయ పద్ధతి కానప్పటికీ, లేట్‌నైట్‌ షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, వంటగదిలోకి అడుగు పెట్టకుండానే రంజాన్‌ సమయంలో రిలాక్స్‌డ్‌ ఫుడ్‌ని  ఇష్టపడే వారూ పెరగడం వల్ల కొత్తగా సెహ్రీ ఇంటి బయట ఊపందుకుంటోంది. రెస్టారెంట్లలో సెహ్రీ భోజనం సాధారణంగా తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. 

సిసలైన సిటీ రుచుల సెహ్రీ.. 
సాధారణ బిర్యానీ లేదా హలీమ్‌లా కాకుండా, సెహ్రీలో కిచిడీ ఖట్టా–ఖీమా, నిహారీ విత్‌ నాన్, దమ్‌ కా కీమా  కబాబ్‌లతో సహా అనేక రకాల సంప్రదాయ  వంటకాలు సెహ్రీలో వడ్డిస్తారు. వీటిని రెస్టారెంట్లు ఈ సమయంలో ప్రత్యేకంగా అందిస్తాయి. కబాబ్‌లు వగైరా కూడా ఇందులో ఉన్నాయి, కానీ పూర్తిగా కొత్త మెనూను ఈ సందర్భంగా చాలా మంది రుచి చూస్తారు. 

సిటీలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్‌సైడ్‌ కేఫ్స్‌ సైతం ప్రత్యేక సెహ్రీ మెనూ ప్లేటర్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లేటర్లు లేదా కాంబోలు కనీసం నలుగురికి సరిపోయేంత పెద్దవిగా ఉండడం విశేషం. ఎక్కువగా ఈ సెహ్రీ కాంబోల్లో కబాబ్‌లు, రోటీలు, అన్నం, పప్పులతో పాటు మాంసాహార స్టార్టర్‌ల మిశ్రమం ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల కబాబ్‌లు, నయాబ్‌ హోటల్‌లో పాపులర్‌ డిష్‌ ఓ ఆఫాల్‌ ఫ్రై, రోటీ పే బోటీ,  కబాబ్స్‌తో రోగ్ని రోటీ వంటివి సెహ్రీ స్పెషల్స్‌గా పేరొందాయి.  

ఎక్కడెక్కడ రుచి చూడొచ్చు అంటే.. 
ఓల్డ్‌ సిటీ, టోలిచౌకి, విమానాశ్రయ రహదారి (అరామ్‌ఘర్‌) వంటి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సెహ్రీ మెనులను అందిస్తాయి. అలాగే –టోలిచౌకి వంటి ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఆహార దుకాణాలు కనిపిస్తాయి. పాతబస్తీలోని నయాబ్‌ హోటల్‌ వంటి కొన్ని రెస్టారెంట్లు తమ సెహ్రీ మెనులను ఉదయం 1 గంట నుంచే అందిస్తాయి. అపరిమిత సెహ్రీ బఫేలను అందించేవి కూడా ఉన్నాయి. 

‘గత సంవత్సరం ఇంటి బయట ‘సెహ్రీ’ కోసం అనేక మంది ఆసక్తిని కనబరిచారు, అందువల్ల మేం అనేక కొత్త రుచులను  జోడించాం. ఉదయం 1 నుంచి 5 గంటల వరకూ స్పెషల్‌ మెనూలు అందిస్తున్నాం’ అని చార్మినార్‌ సమీపంలోని హోటల్‌ నయాబ్‌కు చెందిన జునైద్‌  అంటున్నారు. కొత్త మెనూలో ‘ఆచారి’ మటన్‌/చికెన్, నయాబ్‌ స్పెషల్‌ చికెన్, ‘కిచ్డీకి’, ‘దమ్‌ కా ఖీమా’ వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం సెహ్రీ నగర నిజానికి ఒక భారీ ఆకర్షణగా మారుతోంది. మేం మా ‘సెహ్రీ’ మెనులో మటన్‌ ‘తహరీ’ అనే ప్రత్యేక వంటకం అందిస్తున్నాం’ అని లకడికాపూల్‌లోని పెషావర్‌ రెస్టారెంట్‌కు చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ మోయిద్‌ చెబుతున్నారు.  

(చదవండి: జెన్‌–జడ్‌ రెబల్స్‌..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!)
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)