Breaking News

నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!

Published on Mon, 01/06/2025 - 10:23

శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్‌. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్‌ గురువు సరోజ్‌ వైద్యనాథన్‌. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు. 

రామా వైద్యనాథన్‌ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్‌  స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది. 

ఎదిరిస్తూ నిలుస్తూ..
పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్‌ క్లాసుల కోసం సెంట్రల్‌ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్‌ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు. 

యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి. 

నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది.  

--రామా వైద్యనాథన్‌

(చదవండి: రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)