Breaking News

అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసేది వీరే!

Published on Mon, 01/22/2024 - 10:44

500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇవాళే అయోధ్యలో కన్ను పండుగగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగనుంది. మరికొద్దిసేపటిలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. అంతేగాదు దేశ విదేశాల నుంచి సైతం రామభక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఆయోధ్య రాముడుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన ధరించే బట్టలను అందంగా  డిజైన్‌ చేసి ఎవరూ ఇస్తారు? వాళ్లేవరూ? వంటి విశేషాలు గురించి  తెలుసుకుందాం!

అయోధ్యలో ఓ చిన్న టైలర్‌‌‌‌ దుకాణం బాబూ లాల్‌‌‌‌ టైలర్స్‌‌‌‌. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్‌‌‌‌, శంకర్‌‌‌‌ లాల్‌‌‌‌ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్‌ చేస్తారు. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌‌‌‌దాస్‌‌‌‌ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌ల తండ్రి బాబూలాల్‌‌‌‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేసి కుడతారు.

అలా..సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలు వేస్తారు. వాళ్లు కేవలం రాముడికి మాత్రమే గాక లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలిగ్రామాలకు కూడా బట్టలు కుట్టడం జరుగుతుంది. ఈ టైలర్లు అయోధ్యలోని బడి కుటియా ప్రాంతంలో శ్రీ బాబులాల్ టైలర్ పేరుతో ఎనిమిది అడుగుల గదిలో దుకాణం నడుపుతున్నారు.

ఈ అయోధ్య రామమందిరం భూమిపూజ రోజు రామునికి ఆకుపచ్చరంగు దుస్తులను కుట్టారు. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలర్‌ దుస్తులను డిజైన్‌ చేశారు. అయితే ఆ సోదరులు రాముడుకి దుస్తులు కుట్టేందుకు సిల్క్‌ని వాడగా, బంగారం దారంతో కుట్టడం జరుగుతుంది. పైగా వాటిపై నవగ్రహాలు ఉండటం విశేషం. ఈ ఇరువురు సోదరులు రామ్‌లల్లా కోసం దుస్తులు కుట్టడంలో చాలా ప్రత్యేకతను చూపి తమ భక్తిని చాటుకుంటున్నారు. అంతేగాదు మా జీవితకాలంలో ఈ గొప్ప రామాలయాన్ని చూడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందంగా చెబుతున్నారు ఆ సోదరులు.

(చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!)

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)