Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు
Breaking News
ఎల్ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?
దుబాయ్‌లో గ్రాండ్‌గా తల్లి బర్త్‌డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్
‘యాషెస్’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్‌లాగే!
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కోనసీమ కలెక్టర్ మహేష్‌కు తప్పిన ప్రమాదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌కు షాక్.. కేసు నమోదు
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా
సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ అభ్యర్థికి బిగ్ షాక్
ఆప్ఘనిస్తాన్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి
మేయర్‌గా మమ్దానీ ప్రమాణం.. ఖాతాలో మరో రికార్డు
బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సీమా దాస్ కీలక వ్యాఖ్యలు
Rajasthani Onion Kachori: రాజస్థానీ ఉల్లి కచోరీ
Published on Sun, 05/30/2021 - 12:18
కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; వంట సోడా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కలోంజీ (ఉల్లి గింజలు) – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను (బాగా నలపాలి); పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ఉల్లిపాయలు – అర కిలో (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చాట్ మసాలా – ఒక టీ స్పూను; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; బంగాళ దుంప – 1 (మీడియం సైజు); కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను
తయారీ:
- ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కలోంజీ, నెయ్యి వేసి బాగా కలపాలి
- తగినన్ని నీళ్లు జత చేస్తూ, సుమారు పది నిమిషాల పాటు పూరీ పిండిలా గట్టిగా కలపాలి
- ఒక టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి, పైన తడి వస్త్రం వేసి సుమారు అరగంట పక్కన ఉంచాలి
- బంగాళ దుంపను ఉడికించి, తొక్కు తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచుకోవాలి
- స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి
- నలిపి ఉంచుకున్న ధనియాలు జత చేయాలి
- పచ్చి మిర్చి తరుగు, ఇంగువ జత చేసి బాగా కలపాలి
- ఉల్లి తరుగు వేసి సుమారు పది నిమిషాల పాటు బంగారు రంగులోకి వచ్చేవర కు కలుపుతుండాలి
- ఉప్పు, చాట్ మసాలా, మిరప కారం, పసుపు, గరం మసాలా జత చేసి మరోమారు కలపాలి
- ఉడికించి ఉంచుకున్న బంగాళ దుంప ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి
- కొత్తిమీర తరుగు, నిమ్మ రసం జత చేసి కలిపి, దింపి చల్లారనివ్వాలి
- నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి
- ఉల్లి తరుగు మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి
- మైదా పిండి ఉండలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని, కొద్దిగా వెడల్పుగా ఒత్తాలి
- ఉల్లి మిశ్రమం ఉండను మధ్యలో ఉంచి, అంచులు మూసేసి, చేతితో జాగ్రత్తగా కచోరీ మాదిరిగా ఒత్తాలి
- స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా మరిగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న కచోరీలు వేసి, స్టౌ ఆర్పేయాలి మూడు నిమిషాల తరవాత కచోరీలు పైకి తేలుతున్న సమయంలో, స్టౌ వెలిగించి, కచోరీలను బాగా వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి.
గ్రీన్ ఫిష్ కర్రీ.. ఇలా తయారీ!
#
Tags : 1