Breaking News

అది మన డీఎన్‌ఏలోనే ఉంది ..! మాధవన్‌ కుమారుడు వేదాంత్‌

Published on Sun, 09/13/2026 - 15:25

కోలీవుడ్‌ నటుడు మాధవన్‌ కుమారుడు వేదాంత్‌ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అతను ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు ఐచి ప్రిఫెక్చర్‌, జపాన్‌లోని నగోయాలో జరగనున్న ఖండాంతర బహుళ క్రీడా పోటీల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈనేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో తను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, మన భారతీయ అథ్లెట్లకు ప్రతిభ ఎలా ఉంటుంది తదితరాల గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. 

మన భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందని చెబుతున్నాడు. నిజం చెప్పాలంటే జన్యపరంగా మనం చాలా అదృష్టవంతులమని అంటున్నాడు. మన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణను, ప్రేరణను సరిదిద్దుకోగలిగినట్లయితే మనం నిజంగా మంచి క్రీడాకారులుగా రాణించగలమని అన్నాడు. అయితే మనల్ని వెనక్కి లాగేస్తున్న అంశం మన ఆహారపు అలవాట్లేనని చెబుతున్నాడు. భారతీయ శరీరాలకు ఎక్కువ కొవ్వుని నిల్వ చేసుకోగల సామర్థ్యం ఉందని తెలిపాడు. అందువల్లే మనవి సన్నగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉండే శరీర రకంగా అభివర్ణించాడు. 

వేల ఏళ్ల క్రితం వేట జీవనశైలి నుంచి పరిణామ క్రమం చెందుతూ వచ్చిందన్నారు. ఫలితంగా మనశరీరాలు చెప్పుకోదగిన కండ ద్రవ్యరాశిని నిర్మించకుండా అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వుని నిల్వగా ఉంచుకోవడం నేర్చుకున్నాయని చెప్పారు. ఈ తత్వమే మన ప్రజలను తీవ్ర కరువుని తట్టుకుని బయటపడటానికి సహాయపడిందని చెబుతున్నాడు. కాబట్టి మనం మరింత ప్రోటీన్‌ తీసుకోవడం మొదలుపెట్టి మన ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహిస్తే..మన జన్యవుల నుంచి ఇంకా ఎంతో సాధించగలమని సూచిస్తున్నాడు. 

రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న తరుణంలో తాను ఒక డైటీషియన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. అది తన ఫామ్‌ వేగాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడిందని చెబుతున్నాడు ఈ స్విమ్మర్‌. అలాగే తాను గత కొన్ని నెలలుగా వెయిట్ ట్రైనింగ్‌, స్ట్రెంత్ కండిషనింగ్‌పై దృష్టి పెట్టిమరి శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆసియా క్రీడల్లో అతడు 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఈత కొట్టబోతున్నట్లు తెలిపాడు. 

అయితే ఇది అంత సులభం కాదని తెలుసని, అందుకే తన సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాదిమంది కళ్లు ఒక ఆటగాడిపైనే ఉంటాయి, అందువల్ల ప్రపంచ స్థాయిలో పోటీపడటానికి సిద్ధమవుతున్నప్పుడు శక్తిమంతమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలని అంటున్నాడు. తాను గెలవగలననే గట్టి నమ్మకం అతడికి ఉండాలంటున్నాడు. అలాగే మన లక్ష్యం ఎల్లప్పుడూ నక్షత్రాలపై ఉంటేనే చంద్రుడిపై దిగగలమంటూ తన సంభాషణను ముగించాడు వేదాంత్‌.

ఇదీ చదవండి: చిన్నారులు జంక్‌ ఫుడ్‌ తినకుండా..ఆ టీచర్‌ ట్రిక్‌ మాములుగా లేదు!

 

Videos

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

చేసిందే వెధవ పని.. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్

New Rule: పెళ్లయ్యాక NOMINEE పేరు మార్చారా? లేదా? మీ PF డబ్బులు గోవిందా!

7 టన్నుల విభూతి గణేష్.. ఎక్కడో తెలుసా!

జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్ అబ్బయ్య చౌదరి అదిరిపోయే కౌంటర్

RK రోజా నివాసంలో వినాయక చవితి వేడుకలు

కర్నూలులో గణేష్ నిమజ్జనానికి దయనీయం

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)