Breaking News

బ్రిటన్‌ రాణి సైతం చాక్లెట్‌ టేస్ట్‌కీ ఫిదా..!

Published on Mon, 11/11/2024 - 12:19

చాక్లెట్లంటే చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమో మనందరికి తెలిసిందే. అలాంటి చాక్లెట్ల టేస్ట్‌కి బ్రిటన్‌ రాణి క్వీన్‌ఎలిజబెత్‌ కూడా ఫిదా అయ్యిపోయేవారట. ఆమె తన స్నాక్స్‌ టైంలో చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనట. రాజదర్పానికి తగ్గట్టుగా ఆమె అత్యంత ఖరీదైన చాక్లెట్లనే ఇష్టపడేవారట. అవి అంటే ఆమెకు మహాప్రీతి అని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ చెఫ్‌ చెబుతున్నారు. అంతేగాదు ఆయన క్వీన్‌ ఇష్టపడే చాక్లెట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.

దివంగత క్వీన్ ఎలిజబెత్ II చాలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అవలంభించేవారు. ఆమె మంచి ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధిగాంచిన రాణి కూడా. అయితే క్వీన్‌ ఎలిజబెత్‌కి సైతం చాక్లెట్‌లంటే ఇష్టమని ఆ రాజకుటుంబానికి సేవలందించిన చెఫ్‌ డారెన్‌ మెక్‌గ్రాడీ చెబుతున్నారు. ఆమె డార్క్‌ చాక్లెట్‌లు మాత్రమే ఇష్టంగా తినేవారని అన్నారు.

 పాలతో తయారు చేసిన చాక్లెట్‌లను ఇష్టపడేవారు కారట.  డార్క్ చాక్లెట్‌తో మిక్స్‌ చేసి ఉండే పుదీనా బెండిక్స్  ఫాండెట్‌లను ఇష్టంగా తినేవారట. ఈ చాక్లెట్‌ బాక్స్‌ ఒక్కోటినే రూ. 544లు పలుకుతుందట. ఆమె రోజులో ఉదయం అల్పాహరం,  మధ్యాహ్నం  భోజనం, సాయం సమయంలో టీ.. ఆపై రాత్రి భోజనంగా జీవనశైలి ఉంటుందట. 

ఆమె గనుక రోజుని ఎర్ల్ గ్రే టీ విత్‌ బిస్కెట్స్‌తో ప్రారంభిస్తే..కచ్చితంగా రోజంతా డిఫరెంట్‌ చాక్లెట్‌లను ఆస్వాదించేవారని చెప్పుకొచ్చారు మెక్‌గ్రాడీ. అలాగే అత్యంత లగ్జరియస్‌ చాక్లేటియర్ చార్‌బొన్నెల్‌ చాక్లెట్‌ని అమితంగా ఇష్టపడేవారని అన్నారు. దీని ఖరీదు ఏకంగా రూ. 30 వేలు పైనే ఉంటుందట. ఇక్కడ రాణి గారు ఇష్టపడే బెండిక్స్‌, చార్‌బొన్నెల్‌ బ్రాండ్‌లు రెండు బ్రిటన్‌కి చెందిన ఫేమస్‌ బ్రాండ్‌లే కావడం విశేషం. 

ఇక డైట్‌ పరంగా క్వీన్‌ ఎలిజబెత్‌ సమతుల్య ఆహారాన్నే తీసుకునేవారని చెఫ్‌ మెక్‌గ్రాడి చెబుతున్నారు. ఆమె చాక్లెట్‌ పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టి పెట్టి తీసుకునేవారని అన్నారు. ఆరోగ్యం పట్ల ఉన్న ఈ నిబద్ధతే క్వీన్‌ ఎలిజబెత్‌ సుదీర్ఘకాల జీవన రహస్యం కాబోలు..!.

(చదవండి: వెదురు బ్రష్‌లు ఎప్పుడైనా చూశారా..?)

 

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)