Breaking News

పంజాబ్‌ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?

Published on Sun, 09/29/2024 - 14:16

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్‌ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.

లెప్టోస్పిరోసిస్ అంటే ..?
లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్‌ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. 

లక్షణాలు..
ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. 

వ్యాధి తీవ్రత..
దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. 

నిర్థారించడం కష్టమైతే..
ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.

ఎందువల్ల అంటే..
కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్‌కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్‌ చేసి, సీల్‌ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. 

తొలిసారిగా..
1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్‌ నికోబార్‌ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.

(చదవండి: ఓ డాక్టర్‌ హార్ట్‌ బిట్‌..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!)

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు