Breaking News

వీరి వీరి గుమ్మడి విజయానికి చూపే దారి ఇది

Published on Sat, 06/01/2024 - 08:12

వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది చెన్నైకి చెందిన పంప్‌కిన్‌ టేల్స్‌. ఆల్‌–ఉమెన్‌ టీమ్‌ రెస్టారెంట్‌గా ప్రత్యేకతను సాధించిన‘పంప్‌కిన్‌ టేల్స్‌’ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే బడి. చల్లగా చూసే అమ్మ ఒడి.
‘పంప్‌కిన్‌ ఉపాధి ఇవ్వడమే కాదు. ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునేలా సహాయపడుతుంది’ అంటారు ఉద్యోగులు.

ఉద్యోగం కోసం తాను ఉంటున్న డార్జిలింగ్‌ నుంచి గోవాకు వెళ్లాలనుకున్న అనూష మింజ్‌ విధివశాత్తు చెన్నైకి వచ్చింది. అక్కడి వాతావరణం ఆమెకు బాగా నచ్చింది.

‘నా కొలీగ్స్‌తో ఎన్నో విషయాలు చర్చించే అవకాశం దొరికింది’ అంటుంది అనూష.

‘మహిళలు కేఫ్‌లను నిర్వహించలేరు’లాంటి అపోహలకు అడ్డుకట్ట వేయడం కోసం చింది వరదరాజులు, జె.భువనేశ్వరి, ఆర్‌. రాజేశ్వరి అనే మహిళలు 2017లో ‘పంప్‌కిన్‌ టేల్స్‌’ప్రారంభించారు. రెస్టారెంట్, బేకరి, కేటరింగ్‌ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకుంది... పంప్‌కిన్‌ టేల్స్‌.

టేబుల్స్‌ను సెట్‌ చేయడం నుంచి కస్టమర్‌లతో ఇంటరాక్ట్‌ కావడం, ఆర్డర్లు తీసుకోవడం, టేక్‌ అవేలను రెడీ చేయడం వరకు ఎన్నో పనులు చేస్తుంది ఈ ఆల్‌–ఉమెన్‌ టీమ్‌.

‘ఉద్యోగంలో చేరే  సమయంలో రెస్టారెంట్‌లో పనికి సంబంధించి వారిలోప్రాథమిక జ్ఞానం ఉంటుంది. ఆ తరువాత టేబుల్‌ సెట్‌ చేయడం నుంచి కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వెంటనే వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది’ అంటారు కంపెనీ డైరెక్టర్లు భువనేశ్వరీ, రాజేశ్వరి.

ఉదాహరణకు ‘పంప్‌కిన్‌’ వందమందికి పైగా మహిళల కుటుంబాలకు ఉ΄ాధి కల్పిస్తోంది. రెస్టారెంట్‌ ప్రారంభమైనప్పుడు షిల్లాంగ్‌కు చెందిన మోనిక వెయిటర్‌గా చేరింది. ఇప్పుడు ఆమె రెస్టారెంట్‌కు సంబంధించిన సమస్త విషయాలలోప్రావీణ్యం సాధించింది.

‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయి చెన్నైలో పనిచేస్తోంది. నెల నెలా నాకు డబ్బులు పంపిస్తుంది అని నా గురించి అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది’ అంటుంది మోనిక.


మోనిక ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట సొంతంగా రెస్టారెంట్‌ ్ర΄ారంభించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘పంప్‌కిన్‌ టేల్స్‌’ అనేది అనే ఉ΄ాధి కేంద్రమే కాదు,  ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగపడే కేంద్రం కూడా.
 

 

#

Tags : 1

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)