Breaking News

PSL 2024 తొలిసారిగా​ అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్‌

Published on Mon, 02/19/2024 - 16:28

పాకిస్తాన్‌ క్రికెటర్‌  షోయబ్ మాలిక్ మూడో భార్య  నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా  ట్రోల్‌ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్‌, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు  వెళుతున్న దృశ్యాలు హల్‌చల్‌ చేశాయి.  దీనిపై కొంతమంది ఫ్యాన్స్‌ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం  నెగిటివ్‌గా కమెంట్స్‌ చేశారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్‌ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్‌ చేస్తూ కనిపించింది.  దీనికి సంబంధించిన వీడియోలు,  చిత్రాలు వైరల్‌ గా మారాయి.

 మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన  ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్‌ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు  షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. 

కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్‌ మాలిక్‌ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా,  మాలిక్‌కు మూడో పెళ్లి.

కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్  ఆరోపించడం గమనార్హం.. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)