Breaking News

డ్రైఫ్రూట్స్‌తో ఎనర్జీ బాల్స్‌.. బోలెడు పోషకాలు

Published on Fri, 06/30/2023 - 10:22

ఎనర్జీ బాల్స్‌ తయారీకి కావల్సినవి: 
రాగిపిండి – అరకప్పు
మునగ ఆకు పొడి – ముప్పావు కప్పు
ఎండిన అంజీర పండ్లు – ఆరు
కర్జూరం – పన్నెండు
కిస్‌మిస్‌ –పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు 
బాదం – పావు కప్పు,  పిస్తా – పావు కప్పు
ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు,బెల్లం పొడి – పావు కప్పు
యాలకుల పొడి – టీస్పూను; నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు;
ఎండు కొబ్బరి పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు (గార్నిష్‌కు సరిపడా). 

ఎనర్జీ బాల్స్‌ తయారీ విధానమిలా..
అంజీర పండ్లు, కర్జూరం విత్తనాలు తీసేసి వేడినీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి రాగిపిండి వేసి వేయించాలి. రాగిపిండి మంచి వాసన వస్తున్నప్పుడు మునగాకు పొడి వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి. ఇదే బాణలిలో డ్రైఫ్రూట్స్‌ అన్నింటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

చివరగా ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. వేయించిన డ్రైఫ్రూట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. నానబెట్టిన కర్జూరం, అంజీరను పేస్టులా గ్రైండ్‌ చేయాలి. బాణలిలో మరో టేబుల్‌ స్పూను నెయ్యివేసి అంజీర పేస్టుని వేసి సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంత వరకు వేయించాలి.

వేగాక డ్రైఫ్రూట్స్‌ పొడి, రాగి, మునగాకు, యాలక్కాయ బెల్లం పొడులు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత పిండి మిశ్రమాన్ని లడ్డులా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్దుకుంటే ఎనర్జీ బాల్స్‌ రెడీ. గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులపాటు తాజాగా ఉంటాయి.      

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)