Breaking News

మాటతో మాయచేస్తూ...మనసుల్ని దోచుకుంటాడు!

Published on Tue, 02/25/2025 - 16:29

గత కొంతకాలంగా చిన్నారుల్లో ఫోన్‌ వాడే అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. ఆ అలవాటును మాన్పించేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేపట్టాడు నగరానికి చెందిన ప్రముఖ వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్‌ కుమార్‌. వివిధ రకాల జంతువుల బొమ్మలతో పప్పెట్‌ షోలు నిర్వహిస్తూ చిన్నారుల్లోని ఫోన్, టీవీ చూసే అలవాటును మాన్పిస్తున్నారు. అలాంటి అలవాట్లతో వచ్చే అనర్థాలను తెలియజేస్తూ వారిని ఎడ్యుకేట్‌ చేస్తున్నారు. దీంతో పాటు గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నాడు.  – సుల్తాన్‌బజార్‌ 

చిన్నారుల్లోని మానసిక స్థితిని మార్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్‌ కుమార్‌. తద్వారా నగరంలోని ఎందరో తల్లిదండ్రుల మన్ననలను పొందుతున్నాడు. నగరంలోని పేరొందిన కార్పొరేట్‌ పాఠశాలలతో పాటు అమెరికా, జర్మనీ, జపాన్, లండన్, శ్రీలంక లాంటి దేశాల్లో తనదైన శైలీలో ప్రదర్శనలు ఇస్తూ జాతీయస్థాయిలో అవార్డులను అందుకుంటున్నారు. 
చిన్నారుల్లో మార్పుకు దోహదం.. 
కార్టూన్‌ షోలకు ఎడిక్ట్‌ అయిన చిన్నారులను వాటి ద్వారా రుగ్మతలను దూరం చేసేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్న తల్లిదండ్రులు టీవీ, మొబైల్‌ ఎడిక్షన్‌ నుంచి వారిని మాన్పించే విషయంలో విఫలమ వుతున్నారు. ఈ క్రమంలో తన వెంట్రిలాక్విజం కళతో పలు పాఠశాలల ఆహ్వానం మేరకు 30 నిమిషాల పప్పెట్‌ షో నిర్వహిస్తున్నాడు. తద్వారా వివిధ జంతువులు, తోలు బొమ్మల ద్వారా వెంట్రిలాక్విజం చేస్తూ చిన్నారుల్లోని అలవాట్లను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యాబోధన ద్వారానే కాకుండా ఇలాంటి షోల ద్వారా చిన్నారుల్లో ఎంతో మార్పు వస్తుందని పలు పాఠశాలల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

జాతీయస్థాయి అవార్డు.. 
దేశ విదేశాల్లో  వెయ్యికి పైగా షోల ద్వారా చిన్నారుల మానసిక పరివర్తనలో మార్పుతెచ్చేందుకు కృషిచేసిన సంతోష్‌కు ఎర్లీ చైల్డ్‌హుడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ ఈ నెల 15న ముంబయిలో జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇదే ప్రోత్సహంతో చిన్నారుల మానసిక స్థితిని మార్చేందుకు  ప్రభుత్వ పాఠశాలల్లోనూ పప్పెట్‌ షోలు నిర్వహిస్తానని, అయితే దానికి ప్రభుత్వ సహకారం కావాలని సంతోష్‌ కోరుతున్నాడు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)