Breaking News

ఉపన్యాసాలు, రాతల కన్నా శక్తిమంతమైనది ధ్యానశక్తి.!

Published on Thu, 03/13/2025 - 14:43

ఎవరైతే జీవిత ప్రాముఖ్యాన్నీ, దాని ప్రయోజనాన్నీ తెలుసు కోవడానికి ప్రయత్నించరో... అటువంటివారు తమ జీవితాన్ని వృథా చేసుకొంటారు. చాలామంది తాము ప్రస్తుతం చేస్తున్న  ఉద్యోగాలు, వృత్తులపైనా; బంధువులు, స్నేహితులు, విలాసాల పైనా మనసును నిమగ్నం చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటివారు దురదృష్టవంతులు. ఎందుకంటే... వారు పైపై ప్రాపంచిక విషయాల వల్ల సంతోషాన్ని పొందుతూ, విషయవాంఛల్లో మునిగిపోతూ ఉంటారు. జీవితంలో ఏ సంఘటన కూడా అటువంటి వారి హృదయాన్ని చలింపజేయదు. ఆ విధంగా ఎంత కాలం మోటుగా జీవితం సాగించగలరు?

పరాత్పరుడే వారిని ఏదో ఒకరోజు తన వైపు మళ్ళించుకుంటాడు. ముందుగా ప్రతికూ లత, నిరాశ, నిస్పృహలు వారిని చుట్టు ముడ తాయి. అందువలన వారికి అతీతమైన ఏదో ఒక శక్తి వారి ఊహలను తారుమారు చేస్తూ ఉన్నట్లు తెలుసుకుంటారు. అప్పుడు వారు నెమ్మదిగా దేవాలయాలకు, గురువు దగ్గరికి వెళ్ళడం, సంప్రదాయంగా పూజించడం ప్రారంభిస్తారు. చివరగా వారు జీవితం ఎందుకు వచ్చింది, దానికి గల ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తారు.

చదవండి: ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్‌

దుఃఖం, నిరాశ కలిగే వరకూ వేచివుండి, దేవుని శరణు జొచ్చుట తెలివిగలవారు చేసే పనేనా? మరణం సంభవించే వరకూ నిరీక్షిస్తూ, మందబుద్ధితో ఉండటమా? దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించాలి. నీకు జీవితం ఎందుకు వచ్చిందంటూ విచారిస్తూ (ఆలోచిస్తూ) కాలం వృథా చేయకూడదు. అంటే ఈ విషయాన్ని త్వరగా తెలుసుకొని, జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఉపన్యాసాల కన్నా, రాతల కన్నా శక్తిమంతమైనది ధ్యానశక్తి. ఉపన్యాసాలు, పుస్తకాలు స్వల్ప ప్రయోజనం కలిగిస్తాయి. ప్రారంభ దశలో ఉన్నవారికి అవి మార్గాన్ని చూపించడానికి ఉపయోగ పడతాయి. ఆధ్యాత్మిక విషయాలలో అవి మీ ఆసక్తిని పెంపొందించినా పెంపొందించవచ్చు. మెదడుకు మేత పెట్టవచ్చు. బుద్ధికి ప్రోత్సాహాన్ని కలిగించవచ్చు. కాని అవి ‘ఆత్మజ్యోతి’ని చూపించలేవు. ఇటువంటి దర్శనానికై మనస్సు ఆత్మను అంటిపెట్టుకొనిఉండాలి. ఈ విషయంలో సద్గురువు నిర్దేశంలో ధ్యానం చేయడమే మార్గం. నీవు దేనిని గూర్చి అన్వేషిస్తున్నావో, అది నీ లోపలే ఉంది. పుస్తకాలన్నీ బాహ్య ప్రపంచంలో ఉన్నాయి. ధ్యానంలోనే నిజమైన కార్యం జరిగిపోతుంది. ‘ఆత్మపై లక్ష్యమును ఉంచి ధ్యానం చెయ్యి’ అని భగవద్గీత కూడా ప్రబోధిస్తోంది 

శ్రీగణపతి సచ్చిదానందస్వామి 

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)