Breaking News

Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు

Published on Tue, 06/10/2025 - 15:47

బోనాలు.. పోతురాజులు.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీపడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఒళ్లు గగుర్పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడ ముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కోరడాలతో సై..సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టు కుంటుంది.– గోల్కొండ  

 

పోతురాజుల ప్రత్యేక ఆకర్షణ..  

పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లు మనే గజ్జెలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కోరడాలతో, నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. కాగా గోల్కొండ కోట బోనాలలో గత దశాబ్ద కాలంగా పోతురాజుగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తల్వార్‌ శివ. పోతురాజు వేషంలో స్థానిక ప్రజల అభిమానాన్ని పొందాడు. అమ్మమీద భక్తితోనే బోనాల ఉరేగింపులో పోతురాజు వేషం వేస్తున్నానని తల్వార్‌ శివ అంటున్నాడు. ఒక్క రోజు వేషానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరేగింపులో విన్యాసాలు చేస్తుంటే ప్రజలు తమను ఆదరిస్తారని, ఇది తమకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని అంటున్నారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)