పొగలు కక్కే క్యాండీ తింటున్నారా? పేగులు చిల్లులు పడతాయి జాగ్రత్త

Published on Tue, 09/26/2023 - 16:45

పొగలు కక్కే మిఠాయి కొద్దికాలంగా ఇండోనేషియాలో వేలంవెర్రిగా మారింది. రంగురంగుల్లో నోరూరించే ఈ మిఠాయిపేరు ‘చికి ఎంగెబుయి’. ఇది సాదాసీదా క్యాండీలాంటి మిఠాయే! అయితే, పొగలు కక్కుతూ కనిపించేందుకు దీనిపై లిక్విడ్‌ నైట్రోజన్‌ చల్లి తినడానికి అందిస్తారు. దట్టమైన ఆవిరిలాంటి పొగలు కక్కుతూ ఉండటంతో దీనికి ‘డ్రాగన్‌ బ్రీత్‌’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు.

ఇక ఇండోనేసియాలో ఈ క్యాండీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. దీనిని తినడం వల్ల పశ్చిమ జావా ప్రాంతంలో దాదాపు ముప్పయిమంది పిల్లలు గతంలో ఆస్పత్రిపాలయిన సంగతి తెలిసిందే. పొగలు కక్కే ఈ చిరుతిండి కడుపులోకి వెళ్లాక, పేగులు చిల్లులు పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గగ్గోలు చెలరేగడంతో పశ్చిమ జావా గవర్నర్‌ రిద్వాన్‌ కామిల్‌ జనవరి 10న ఈ చిరుతిండిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇండోనేసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పొగలు కక్కే మిఠాయి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, దేశవ్యాప్తంగా దీనిని నిషేధించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా కొన్నిరకాల చిరుతిళ్లపై లిక్విడ్‌ నైట్రోజన్‌ చల్లుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిపై ఎప్పుడు దృష్టిసారిస్తాయో చూడాలి మరి! 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)