ప్రయాణికులకు ముఖ్య గమనిక

Published on Sun, 09/14/2025 - 06:09

ఒక్కసారి రైల్వేప్లాట్‌ఫామ్‌పై అడుగు పెడితే ఎన్నో దృశ్యాలు కంటబడతాయి. అనుబంధాలకు అద్దం పట్టే తీయటి దృశ్యం, అత్తారింటికి వెళుతున్న కూతురికి వీడ్కోలు చెబుతూ కళ్లనీళ్ల పర్యంతమయ్యే తల్లిదండ్రుల విచార దృశ్యం, కొత్త ప్రాంతానికి వెళ్లే ఆనందంలో స్నేహితుల వినోద దృశ్యం. యాచకుల హడావిడి దృశ్యం, ఒంటరి జీవుల ఏకాంత దృశ్యం...ఎన్నో ఎన్నెన్నో దృశ్యాలు కనిపిస్తాయి. 

ఇలాంటి ఎన్నో దృశ్యాలకు సంగీత వల్లట్‌ పుస్తకాలు అద్దం పడతాయి. రైల్వేడిపార్ట్‌మెంట్‌లో కమర్షియల్‌ క్లర్క్‌గా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన సంగీత ప్లాట్‌ఫామ్‌ టికెట్‌’ పేరుతో తాజాగా పుస్తకం రాసింది. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలకు ఈ పుస్తకంలో అక్షరరూపం ఇచ్చింది. చెన్నై రైల్వే స్టేషన్‌లో డెబ్బైమంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో తాను ఒక్కరే మహిళా ఉద్యోగి.

హృదయాలను కదిలించే సంఘటనలు మాత్రమే కాదు హాయిగా నవ్వించే సంఘటనలు ఎన్నో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌’లో ఉన్నాయి. ‘భారతీయ రైల్వే దృశ్యాలు’ అనే మాట వినబడగానే ఆర్‌కే నారాయణ్, రస్కిన్‌ బాండ్‌ పుస్తకాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ కోవలో సంగీత పేరు కూడా చేరుతుంది. ఉద్యోగిగా రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఉన్న అనుబంధమే ఆమె కలానికి ఉన్న అసలు బలం.

రైల్వేస్టేషన్‌లలో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలను మాత్రమే కాదు భారతీయ రైల్వే వ్యసస్థ విశ్వరూపాన్ని సూక్ష్మంగానైనా అర్థం చేసుకునే ప్రయత్నం తన రచనల ద్వారా చేస్తోంది సంగీత.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)