Breaking News

ప్లాస్టిక్స్‌ బరువును పెంచుతాయా..?

Published on Sun, 12/15/2024 - 09:59

ఇంతవరకూ ప్లాస్టిక్‌ బౌల్స్‌లో తినకూడదు... అందులోని ప్లాస్టిక్‌ ఒంట్లోకి చేరడంతో ఆరోగ్యపరంగా అనేక అనర్థాలు వస్తాయనే విషయం తెలిసిందే. కానీ ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఉండే నోట్లోకి వెళ్లని వస్తువులతోనూ ఒంటి బరువు పెరుగుతుందనీ, దాంతో పెరిగిన బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనీ, అందుకే ఈ ప్లాస్టిక్‌ను ‘ఒబిసోజెన్స్‌’ అంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.  

ఉదాహరణకు... షాంపూ బాటిల్‌ సైతం మన బరువును పెంచేస్తుందంటున్నారు నిపుణులు. షాంపూ బాటిల్‌ మాత్రమే కాదు...  షవర్‌ జెల్, హెయిర్‌ కండిషనింగ్‌లాంటి ప్లాస్టిక్‌ సీసాలూ, తిరిగి మాటిమాటికీ భర్తీ చేసుకోడానికి అవకాశమున్న బాటిళ్లలో ఉండే ప్లాస్టిక్‌ కూడా బరువును పెంచేస్తుందని నార్వేలోని నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ పరిశోధనల్లో తేలింది.  

ఈ అధ్యయనంలో 629 రకాల వివిధ ప్లాస్టిక్‌ వస్తువుల్లోని దాదాపు 55,000 రకాలకు పైగా రసాయనాలను పరీక్షించారు. ప్లాస్టిక్‌లోని దాదాపు పదకొండు రకాల రసాయనాలు  బరువు పెంచడానికి కారణమవుతున్నాయంటూ తెలుసుకున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మార్టిన్‌ వేజ్నర్‌ పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్‌ సీసాలను వాడినప్పుడు దేహంలోకి ప్రవేశించే 

పదకొండు రకాల రసాయనాల కారణంగా బరువు పెరుగుతుండటంతో వాటిని ‘ఒబిసోజెన్స్‌’ అని  వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బైస్ఫినాల్‌–ఏ వంటి ‘ఒబిసోజెన్స్‌’ దేహంలోని జీవరసాయన ప్రక్రియల్లో పాల్గొనడంతోపాటు కొవ్వు నిండిపోయేలా ఫ్యాట్‌ సెల్స్‌ సంఖ్యను పెంచుతాయని తేలింది. 

దాంతో దేహం బరువు అమాంతం  పెరుగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో పరిశోధకుడు జొహన్నేస్‌ వోకర్‌  తెలిపారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హానికరమని, అలాగే  బైస్ఫినాల్‌–ఏ, థ్యాలేట్స్‌ వంటి ప్లాస్టిక్స్‌ వల్ల అనేక నరాల సంబంధిత వ్యాధులూ, వ్యాధినిరోధకతను తగ్గించే సమస్యలూ, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసేలాంటి అనారోగ్యాలు కలగవచ్చని తేలింది. 

ఇప్పుడు అవే ప్లాస్టిక్‌ ఉపకరణాలూ, పరికరాలు... బరువు పెరిగేలా చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తాజా పరిశోధనల్లో విస్పష్టంగా తేలింది. ‘ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అనే ప్రముఖ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.     

(చదవండి: నెత్తురు చిందించకుండానే చక్కెర పరీక్ష..!              )          
  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)