Breaking News

ఈ పక్షం.. పితృపక్షం

Published on Mon, 09/15/2025 - 00:53

ఈ ఏడాది పితృ పక్షాలు గ్రహణంతో ప్రారంభం అయ్యాయి. తిరిగి గ్రహణంతోనే ముగియనున్నాయి. అంటే.. సెప్టెంబర్‌ 7వ తేదీ చంద్రగ్రహణంతో ప్రారంభమై.. సెప్టెంబర్‌ 21, ఆదివారం, అమావాస్య నాడు  సంభవించబోయే సూర్యగ్రహణం రోజున ముగియనున్నాయి.

సుమారు 100 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు పండితులు, పెద్దలు చెబుతున్నారు. వివేకవంతులు ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటారు. 
అదెలాగంటే...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పితృదోషాల వల్ల అనేక రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపట్టిన పనులలో పదే పదే ఆటంకాలు కలగడం, కీర్తి, గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, ఎవరో ఒకరికి మానసిక స్థితి సరిగా లేకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా ఆ పుట్టిన సంతానం జీవించకపోవడం వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది. 

ఇవన్నీ పితృ శాపాల వల్ల లేదా పితృదేవతలు అసంతృప్తికి గురవడం వల్ల కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల పితృ పక్షాల సమయం పూర్వీకుల ఆశీస్సుల కోసం అలాగే పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం. అలాగే.. మహాలయ పక్షంలో ఆచరించే శ్రాద్ధ కర్మలు, దానాలు, పుణ్య కార్యాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగి, వంశాభివృద్ధి అవుతుంది. పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.
 
పితృపక్షంలో రోజూ సాయంత్రం పితృదేవతా నిలయమైన నైరుతి మూలన దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, అలాగే.. పితృదేవతలను స్మరించుకుంటూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని కూడా బలమైన నమ్మకం.

అలాగే.. పితృదేవతలకు రోజూ అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. ఒకవేళ జల తర్పణాలు 15 రోజులు వదలడం వీలు కాని వాళ్లు మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. కాకులకు, జంతువులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం, వస్త్ర దానం చేయడం, పండితులకు, గురువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.

పితృ పక్షం సమయంలో ఇంట్లో పూజలు, హోమాలు ఆచరించడం పుణ్యప్రదం. పితృపక్షంలో ఇప్పటికే వారం రోజులకు పైగా గడిచిపోయింది. ఇంకా వారం కూడా పూర్తిగా లేదు. అందువల్ల చివరి రోజైన మహాలయ అమావాస్య వరకు వాయిదా వేయకుండా వీలయినప్పుడల్లా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇక మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదిలే కార్యక్రమం పూర్తి చేశాక.. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మాత్రమే తిరిగి శుభకార్యాలు 
ప్రారంభించాలి.

– డి.వి.ఆర్‌.


 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)