Breaking News

వెన్నెల మెరుపుకి మించినది ..అంతకుమించి మరోకటి ఏముందంటే..

Published on Mon, 07/31/2023 - 09:24

కార్తీక మాస సాయంత్రం. రాగి రంగులో శేషాచలం కొండ మెరుస్తూఉంది. కొందరు భక్తులు కపిల తీర్థం జలధార కింద స్నానం చేస్తున్నారు. మరికొందరు కోనేరు దగ్గర మట్టి ప్రమిదలలో నేతిదీపాలు వెలిగిస్తున్నారు. అక్కడే మెట్ల మీద కూర్చున్న ఓ పండితుడు తన శిష్యుడితో కార్తీకమాసం విశిష్టత గురించి వివరిస్తున్నాడు. ఇంతలో ఆకాశంలోకి చందమామ తొంగి చూడటం ప్రారంభించాడు. వెండి వెలుగులో ఉన్న అక్కడి వారంతా వెన్నెల స్నానం చేస్తున్నట్లుగా ఉంది. ఆ చల్లటి వెన్నెలకు పరవశించిన పండితుడు, తన శిష్యుడితో ‘‘చంద్రుడి వెలుగుకు మించి ఈ ప్రపంచంలో ఏదీ లేదు’’ అన్నాడు.

అక్కడే దీపం వెలిగిస్తున్న ఓ మహిళ, పండితుడి మాటలు విని సరుక్కున తల తిప్పి చూసింది. ‘‘అదేం మాట?’’ అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంది. పండితుడు లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ‘‘వెన్నెల మెరుపును మించింది ఏమైనా ఉంటే చెప్పమ్మా?’’ అని ప్రశ్నించాడు. ఇంట్లో చాలా పనులున్నాయని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెను అక్కడినుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరుసటిరోజు కూడా ఆ పండితుడు తన శిష్యుడితోటి కపిలతీర్థం జలధార చూడటానికి వచ్చి అక్కడే కూర్చున్నాడు. పాలమీగడ పాయలుపాయలుగా వర్షిస్తున్నట్లుగా ఉంది జలధార. ఆరోజు కూడా ఆ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె చంకలో నెలల బిడ్డ ఉన్నాడు. భక్తిగా దేవుడికి మొక్కి దీపారాధన చేస్తోంది.

ఆమె పూజ అయ్యేంతవరకు ఆగిన పండితుడు ‘‘ఏవమ్మా, నిన్న నేను చంద్రుడి వెలుగుకు మింంచి లేదని చెబితే నువ్వు ఒప్పుకోలేదు. కారణం తెలియలేదు. నేను ఎన్నో గ్రంథాలు చదివాను. పెద్దల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా విన్నాను. నేనెక్కడా చంద్రుడికి మించిన వెలుగు, అంతటి మెరుపు ఉంటాయని చదువలేదు, వినలేదు. నువ్వు చెబితే తెలుసుకుందామని ఉంది’’ అని అడిగాడు. ఆ మహిళ చిరునవ్వు నవ్వుతూ తన చేతిలోని బిడ్డకు కోనేరులోని చందమామను చూపింది. ఆ పిల్లవాడు ముసిముసినవ్వులు నవ్వినాడు. ఆ పిల్లవాడి చేతితో, నీటిలో కనిపించే చందమామను తాకించింది.

అలలు అలలుగా చందమామ పక్కకి వెళ్ళిపోయాడు. చందమామను పట్టుకోవాలని ఆ పిల్లవాడు నీళ్ళమీద ధబీధబీమని కొట్టినాడు. చందమామ దొరకలేదు. ‘‘అదుగో... పైకి పాయె చందమామ’’ అంటూ ఆకాశంలోని చందమామను చూపింది. ఆ బిడ్డ బోసినవ్వుతో కేరింతలు కొట్టినాడు. బిడ్డ కాలి వెండి గొలుసులు చిన్నగా మోగాయి. అప్పుడు ఆ మహిళ తన బిడ్డ నవ్వును పండితుడికి చూపిస్తూ ‘‘ఈ ప్రపంచంలో నా బిడ్డ మెరుపు ఎవరికైనా వస్తుందా?’’ అని అడిగింది.

ఆమె మాటలకు ఆశ్చర్య పోయాడు ఆ పండితుడు. ‘‘నిజమే... తల్లి ప్రేమ అలాంటిది. ఏ తల్లికైనా తన బిడ్డ ముఖంలోని మెరుపు, వెలుగుతో సమానమైనవి ఏవీ ఉండవు కదా...’ అనుకుని చిన్నగా అక్కడి నుం తన శిష్యుడిని వెంటబెట్టుకుని కదిలాడు. వెనుకనే ఆ మహిళ బిడ్డనెత్తుకుని ఆకాశం వైపు చూపిస్త ‘‘చందవమ రావే... జాబిల్లి రావే...’’ అని పాడే పాట తెరలు తెరలుగా వినిపిస్తోంది.
– ఆర్‌.సి.కృష్ణ స్వామి రాజు

(చదవండి: గెలుపు.. గమనం.. మలుపు)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)