Breaking News

తాత్త్వికథ: జీవిత పరమార్థం

Published on Mon, 04/14/2025 - 20:15

ఒక యువకుడు జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం ఎంత ఖర్చు అయినా భరించాలనుకున్నాడు. అనేక దూర్ర ప్రాంతాలకు వెళ్ళి పెద్దపెద్ద గ్రంథాలయాల్లోని పుస్తకాలు తిరగేశాడు. మేధావులుగా గుర్తింపబడిన పెద్దలను కలిశాడు. చర్చల్లో పాల్గొన్నాడు. ఎన్నో సమావేశాలకు హాజరయ్యాడు. ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. ఏ గురువునైనా ఆశ్రయిస్తే సమాధానం దొరుకుతుందని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు. ఎక్కడైనా మంచి  గురువు దొరుకుతాడేమోనని వెదుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. వెదకగా వెదకగా నదీ తీరాన ఒక ఆధ్యాత్మిక గురువు కూర్చుని ఉండటం కనిపించింది. ఆ గురువు ముఖంలో తేజస్సు కనిపించింది. తనకి సరైన సమాధానం ఆ గురువు వద్ద దొరుకుతుందని చాలా  సంతోషపడ్డాడు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన మనసులోని భావం చెప్పాడు. తనను శిష్యుడిగా గుర్తించమన్నాడు. దానికోసం ఎంత మూల్యమైనా చెల్లిస్తానని చెప్పాడు.

చదవండి: అమర్‌నాథ్ యాత్రకు ప్లాన్‌ చేస్తున్నారా? వీటిని అస్సలు తీసుకెళ్లకూడదు!

చిరునవ్వుతో గురువు ‘‘మొదట నేను చెప్పినట్లు చేయి. తర్వాత ఆలోచిద్దాం’’ అన్నాడు. చిన్న బిందెను చేత పట్టుకున్న గురువు ఆ యువకుడిని నది దగ్గరకు తీసుకెళ్ళాడు. నదిలోని నీళ్ళను బిందెతో తీసుకుని యువకుడికి ఇస్తూ ‘‘ ఈ నీళ్ళకు నువ్వు డబ్బు చెల్లించాలి’’ అన్నాడు. ఆ యువకుడు వింతగా చూస్తూ ‘‘నది ఎవ్వరికీ స్వంతం కాదు కదా. అది ప్రకతిలో ఒక భాగం కదా, దానికి డబ్బులు ఇవ్వమంటున్నారేమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు.
గురువు ఆ యువకుడిని దగ్గరికి పిలిచి ‘‘నదిలోని నీళ్ళు నేనైనా నువ్వైనా... ఎవ్వరైనా తీసుకోవచ్చు. అది అందరికీ స్వంతం. ఓపికగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించు. జీవిత పరమార్థం తెలుసుకోవడానికి మాత్రం నా అవసరం ఏముంది? అది నీకు నీవుగా లోతుకు వెళ్ళి తెలుసుకునేది. అది ఒకరు ఇచ్చేదీ కాదు, మరొకరు తీసుకునేదీ కాదు. ఎవరికి వారు అనుభూతి చెందేది. దాని ఖరీదు  అమూల్యం’’ అన్నాడు. ‘నిజమే... అది ఎక్కడో దొరికేది కాదు. డబ్బు ఖర్చు చేస్తే వచ్చేది కాదు. శోధించడం ద్వారా మనకు మనం తెలుసుకొనేది’ అని అవగాహన చేసుకున్న ఆ యువకుడు అక్కడినుంచి కదిలాడు.
– ఆర్‌.సి. కృష్ణ్ణస్వామి రాజు 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)