Breaking News

మాఘం మౌనమైతే.. ఫాల్గుణం పెళ్లిబాజాలు

Published on Wed, 02/18/2026 - 09:24

విజయనగరం గంటస్తంభం: మాఘమాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాల మాసం అని పెద్దలు చెప్పకొంటారు. కానీ, ఈ ఏడాది శుక్ర మౌఢ్యమి కారణంగా మంచి ముమూర్తాలు దొరకక చాలామంది వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండటంతో వివాహాలు, శుభకార్యాలకు మళ్లీ చైతన్యం వచ్చింది. పండితులు చెబుతున్నట్టుగా ఈనెల మూడో వారం నుంచే శుభముహూర్తాలు కలసి వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి ఊపందుకోనుంది. 

హడావిడి మొదలు.. 
గ్రామాలు, పట్టణాల్లోని వధూవరుల ఇళ్లలో ఏర్పాటు హడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక కుటుంబాలు మండపాలు, పురోహితులు, అలంకరణల కోసం బుకింగ్స్‌ పూర్తి చేసుకున్నాయి. ఏడాది పొడవునా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయనే వార్తతో పెళ్లిళ్ల సంఖ్య వేలల్లోకి చేరనుందని అంచనా. 

కల్యాణ మండపాలకు భారీ డిమాండ్‌..  
వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్‌ మొదలవుతుండటంతో కల్యాణ మండపాలు, హోటళ్లకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని మండపాలు వరుసగా బుక్‌ అవుతున్నాయి. మండపం స్థాయిని బట్టి అద్దెలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ దృష్ట్యా బాజాభజంత్రీలు, షామియానా వ్యాపారులు, క్యాటరింగ్‌ సంస్ధలకు కూడా పని పెరిగింది. పెళ్లిళ్లకు వచ్చే బంధువుల కోసం లాడ్జీలు, హోటళ్లు ముందుగానే రిజర్వ్‌ అవుతున్నాయి.  

పూల అలంకరణల హవా... 
వివాహాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పూల అలంకరణలకు ఈసారి ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. అలంకరణ రకం, డిజైన్‌ను బట్టి ఖర్చులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి తాజా పూల రకాలను తెప్పిస్తున్నారు. ఫొటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్‌ ఆర్టిస్టులకు కూడా బిజీ షెడ్యూల్‌ మొదలైంది. పురోహితులు సైతం ముందస్తుగానే బుక్‌ అయిపోతుండటంతో తేదీలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబాలకు సూచిస్తున్నారు. 

గ్రామీణ వాతావరణంలో పెళ్లి హడావిడి  
గ్రామల్లో అయితే పెళ్లి పనుల సందడి మరో రకంగా కనిపిస్తోంది. ఇళ్ల ముందర పందిళ్లు, ఊరంతా వెలుగులు, బంధువుల రాకపోకలు..మళ్లీ ఆ పాత హుషారు తిరిగి వస్తోందని పెద్దలు అంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఈ సీజన్‌పై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

ముహుర్తాల కోసం ఎదురుచూపులు ముగిశాయి 
శుక్ర మౌఢ్యమి ఈ నెల 17తో ముగియనుండటంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగింది. ఈనెల 19 నుంచి మే రెండో వారం వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు ఇది అనుకూల సమయమని సూచించారు. 
– జయంతి ప్రవీణ్‌కుమార్, సిద్ధాంతి, జగ్గాపురం   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)