Breaking News

అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!

Published on Fri, 10/18/2024 - 10:07

బాలీవుడ్‌ తారలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రితీష్‌ దేశ్‌ముఖ్‌లను పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. 

గతంలో హాటెస్ట్‌ వెజిటేరియన్‌ సెలబ్రిటీ అవార్డు టైటిల్‌ విజేతలలో జీనత్‌ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్‌ రావు, అలియా భట్, అక్షయ్‌ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్‌ .. వంటి  సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్‌ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్‌ ఆర్యన్, విద్యుత్‌ జమ్వాల్, షాహిద్‌ కపూర్, రేఖ, అమితాబ్‌ బచ్చన్‌ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు  పొందారు. 

ఈ యేడాది జాక్వెలిన్‌ తన స్టార్‌ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.

రితేష్‌ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రితీష్‌ దేశ్‌ముఖ్‌ నిజమైన సూపర్‌ స్టార్‌లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సచిన్‌ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు.
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)