Breaking News

న్యూసెన్స్‌ కేసు పెట్టచ్చు!

Published on Wed, 06/10/2026 - 05:58

మా పక్క ఫ్లాట్లో కుక్కలను పెంచుతున్నారు. అవి రాత్రివేళల్లో మొరుగుతూ మాకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. అంతేకాకుండా పక్క ఫ్లాట్లో దంపతులు మా అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. దాంతో పార్కింగ్‌ప్రాంతం అపరిశుభ్రమవుతోంది. ఈ విషయంపై అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్స్ కు ఫిర్యాదు చేయగా, ఆ దంపతులు నాపై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇతర ఫ్లాట్‌ వాళ్ళు కూడా వారి ప్రవర్తనకు భయపడి మాట్లాడలేకపోతున్నారు. కుక్కల మొరుగుళ్ల వల్ల నాకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఈ పరిస్థితి లో నేను ఏం చేయాలి? నాకు అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటి? 
– జీవన, హైద్రాబాద్‌

చట్టప్రకారం సాధుజంతువులను పెంచడం, వీధికుక్కలకు ఆహారాన్ని పెట్టడంపై ఎటువంటి నిషేధం లేదు. వాస్తవానికి వన్య్రపాణులను, మన చుట్టూ ఉండే జీవజాలాలను కాపాడటం రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. అలాగే, కుక్కలు మొరగకూడదనడం సరికాదు. ఇదే విషయాన్ని భారత జంతు సంక్షేమ బోర్డు 2015, ఫిబ్రవరి 26 నాడు జారీ చేసిన సూచికలో కూడా పేర్కొంది. అయితే, పెంపుడు కుక్కలు నిరంతరంగా లేదా అధికంగా మొరగడం పొరుగు వారికి ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల, ముఖ్యంగా రాత్రిళ్లు తమ కుక్కలు నిశ్శబ్దంగా ఉండేలా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బంది లేదా ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూసుకోవడం, పరిశుభ్రతను పాటించడం కూడా యజమానుల బాధ్యత అని కూడా ఆ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

మీ కేసులో పరిష్కారం లేకపోలేదు. ఆ గోల తీవ్రంగా, నిరంతరంగా కొనసాగుతున్నది అనుకుంటే మ్యాజిస్ట్రేట్‌ ముందు 133 సీ.ఆర్‌.పీ.సీ (ప్రస్తుతం 152 బీ.ఎన్‌.ఎస్‌.ఎస్‌.) కింద న్యూసెన్స్‌ తొలగించాలి అని కేసు వేయవచ్చు. సివిల్‌ కోర్టును సైతం ఆశ్రయించి తగిన పరిష్కారం కోరవచ్చు. సరళంగా చె΄్పాలంటే, కుక్కల వల్ల కలుగుతున్న శబ్ద కాలుష్యం, మురికి లేదా ఇతర ఇబ్బందులు సాధారణ అసౌకర్యాన్ని మించి, నిరంతరంగా... గణనీయంగా ఉంటే, నిద్రలేమి వంటి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తే పైన సూచించిన చర్యలు చేపట్టవచ్చు.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)