అలాంటి పెర్‌ఫ్యూమ్స్‌ కొంటున్నారా..?

Published on Sun, 09/22/2024 - 09:03

చవకైన పెర్‌ఫ్యూమ్స్‌ / సెంట్స్‌ వల్ల అలర్జీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ, వీటివల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్‌ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్‌ వంటి తలనొప్పులు పెరుగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్‌బరీ కెంట్‌ ఛాసర్‌ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్‌ సుసానా బ్యారన్‌ హెచ్చరిస్తున్నారు. వాసనల వల్ల అలర్జీలతో పాటు అవి చర్మానికి తగలడం వల్ల కూడా అనేక రకాల చర్మవ్యాధులూ వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.  

కొంతకాలం కిందట యూరోపియన్‌ యూనియన్‌ సైంటిఫిక్‌ కమిటీ ఒక సర్వే చేసి, తక్షణం అలర్జీకి కారణమయ్యే అలర్జెన్‌ల జాబితాను రూపొందించే కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ క్రమంలో రకరకాల సబ్బులు, షాంపూలు, సెంట్లు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.

చవక రకం సెంట్ల వాసనలతో మైగ్రేన్‌ వంటి తలనొప్పుల కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయంటూ యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ విన్సెంట్‌ మార్టిన్‌ అనే న్యూరాలజిస్ట్‌ సైతం పేర్కొంటున్నారు. వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ డెర్మటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్స్‌ జాగ్రత్తలు చెబుతున్నారు.  

(చదవండి: పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)