Breaking News

అక్కడ గంగానదిలో పిల్లలు గాజు ముక్కతో ఎందుకలా వెతుకుతారో తెలుసా..!

Published on Tue, 05/26/2026 - 14:00

భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు గంగానది ఒడ్డున పిల్లలు గాజుముక్కతో ఏదో వెదుకుతూ, ఆడుతుండటం చూస్తుంటారు. ఈ దృశ్యం చూడడానికి ఎంతో ఉల్లాసంగానూ, ముచ్చటగా కనిపించినా.. దాని వెనక ఎంతో సహనం, ఓర్పు, శ్రమ కూడుకుని ఉంటుందని తెలుసా? నిజానికి పిల్లలు ఎందుకలా చూస్తుంటారు? ఇంతకీ ఏం వెతుకుతుంటారనేది తెలుసుకుందాం!

గంగానది మన దేశ విశ్వాసానికి, సంస్కృతికి గొప్ప ప్రతీక. ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలతో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడటం, వేలాదిమంది తరలి రావటంవంటి దృశ్యం ఒకవంతు అయితే, గంగానది తీరంలో నివసిస్తున్న కొంతమంది పిల్లల జీవితాలు మరోవంతు. ఆ తీరంతో వారి జీవితాలే ముడిపడి ఉన్నాయి. ప్రజలు పూజ చేసేటప్పుడు, తరచుగా నాణెములు, విలువైన వస్తువులను, ఆభరణాలను వారి మొక్కుబడిగా నదిలో విసిరేస్తారు. కాలక్రమేణా.. ఇవి నీటి అడుగున పూడుకుపోతాయి. అలా నీటి అడుగున స్పష్టంగా చూడడానికి ఈ గాజుముక్క వారికి ఎంతగానో సహాయపడుతుంది. దాంతో పిల్లలు నీటిలో పడిపోయిన పాత నాణేలు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు గంటల తరబడి చూస్తున్నాగానీ వారికి ఏమీ దొరకదు.

నిజానికి ఈ గాజుముక్క వారికి ఎలా ఉపయోగపడుతుందంటే? నీటి ఉపరితలంపై పడే సూర్యకాంతి కింద ఉన్న దృశ్యాన్ని అస్పష్టంగా మారుస్తుంది. ఆ పరిస్థితులలో పిల్లలు గాజును ఒక ప్రత్యేక పద్ధతిగా.. నీటిలో ముంచడంతో సూర్యకాంతి తగ్గి, నది అడుగున ఉన్న వస్తువులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా వెతకడం చూడడానికి చాలా సులభంగా అనిపించినా, గంటల తరబడి కష్టపడినా పిల్లలకు ఏమీ దొరకదు. కానీ అదృష్టం కలిసొచ్చి పాత వెండి ఆభరణాలు, విలువైన నాణాలు, ఏదైనా లోహ వస్తువు దొరికితే లాభం పొందవచ్చనేది వారి ఆశ.

కొందరు దీనిని అదృష్టంతో కూడిన ఆటగా భావిస్తే, మరికొందరు ఇది కఠోర శ్రమ, నైపుణ్యానికి సంబంధించిన విషయమని అంటారు. నిజం ఏమిటంటే? ఈ నది తీరాన నివసిస్తున్న పిల్లలు తమ ఇంటి ఖర్చులు తీర్చడానికో? కుటుంబ కష్టాలను తగ్గించడానికో ఉపయోగపడే ఏదైనా వస్తువు గంగానదిలో దొరుకుతుందని ఇలా వెతుకుతుంటారు. వీటిని పురాతన వస్తువుల సేకర్తలు అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. ఆ ఆశతో పిల్లలు ప్రతిరోజూ గంగా నది ఒడ్డుకు తరలివస్తుంటారు.

చూడటానికి ఇదొక ఆటలా అనిపించినా, ఈ పని చాలా ప్రమాదకరమైనది. నదిలోని బలమైన ప్రవాహాలు, లోతైన నీటిస్థలాలు, జారే నేల తరచుగా ప్రమాదాలకు దారితీస్తాయి. స్థానికంగా నివసిస్తున్న పిల్లలు నదిలోకి దిగి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్నిసార్లు గాయపడతారు కూడా. గాజు ముక్కతో గంగానదిలోకి తొంగిచూస్తున్న ఈ పిల్లలు కేవలం వస్తువుల కోసం వెతకడమే కాదు, తమ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తుంటారు.

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)