Breaking News

రతన్‌ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!

Published on Thu, 10/10/2024 - 14:29

టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు.  పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప ‍వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రతన్‌ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్‌ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్‌ పటేల్‌.

పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్‌ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్‌ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్‌ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్‌ మోటార్‌ సైకిల్‌ గ్యారెజ్‌ వాళ్లకు పేరుగాంచింది.

కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్‌లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్‌ రతన్‌ టాటాకు హోమ్‌స్టైల్‌ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప,  ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్‌ ఫుడ్స్‌ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్‌ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు.  

(చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్‌..!)

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)