Breaking News

ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాదు : గుత్తా జ్వాల ఫైర్‌, ఫోటో వైరల్‌

Published on Tue, 07/30/2024 - 11:41

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్‌పై  అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.  ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్‌నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్‌ చేశారు.  ఫోటోలను కూడా ట్వీట్‌ చేశారు. 

‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు  నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్‌ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా.  కానీ  దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రెడీ టూ వేర్‌  చీరను డిజైన్‌ చేయాలన్ని  కనీస  ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్‌లు, బాడీకి ఫిట్‌ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా  మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై  క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ  ఆమె ట్వీట్‌ చేశారు.

దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్‌ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్‌ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి :  పీవీ సింధు ఒలింపిక్‌ చీరపై దుమారం.. నెట్టింట చర్చ
 

కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు  రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించే  క్రమంలో  ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)