Breaking News

సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్‌ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!

Published on Tue, 01/07/2025 - 16:11

రాజస్థాన్‌(Rajasthan)కి చెందిన బిష్ణోయ్‌ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్‌ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్‌ బిష్ణోయ్‌ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్‌ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్‌ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్‌ బిష్ణోయ్‌ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్‌ పోలీసు అధికారి. ఆమె ఇంటర్‌ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. 

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్‌ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్‌ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్‌  జెఆర్‌ఎఫ్‌ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. 

అయితే సివిల్స్‌ ఎగ్జామ్‌ తొలి రెండు ప్రయత్నాలలో పరి  ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్‌ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. 

ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్‌లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు.  తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్‌(Gangtok)లో ఎస్‌డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది.

 

(చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్‌ ..!)

 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)